YS Jagan: ఢిల్లీలో జగన్ కు ఊహించని మద్దతు.. ఇండియా కూటమిలోకి వైసీపీ? ఈ రోజు ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమిలోని ఎస్పీ, టీఎంసీ, శివసేన, ఏఐడీఎంకే పార్టీల కీలక నేతలు హాజరై మద్దతు ప్రకటించారు. దీంతో జగన్ ఇండియా కూటమిలో చేరుతారా? అన్న చర్చ మొదలైంది. కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం జగన్ ధర్నాకు దూరంగా ఉంది. By Nikhil 24 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి YS Jagan Into INDIA Alliance: వైసీపీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ ఈ రోజు ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ధర్నాలో ఊహించని రాజకీయ పరిణామాలో చోటు చేసుకున్నాయి. జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్దతు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ధర్నాలో ఎస్పీ, టీఎంసీ, శివసేన, ఏఐడిఎంకే నేతలు పాల్గొన్నారు. ఉదయం ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ధర్నాలో కూర్చొని జగన్ కు తన మద్దతు ప్రకటించారు. ఉద్ధవ్ శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi), సంజయ్‌రౌత్, అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరై, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ తదితరులు సైతం జగన్ దీక్షకు హాజరై తమ మద్దతు తెలిపారు. జగన్ పోరాటానికి కూటమి మద్దతు ఉంటుందని ఆయా నేతలు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో టీడీపీ చేస్తున్న మారణకాండ వీడియోలు చూశాను.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై చాలా దారుణంగా దాడులు చేస్తున్నారు.. వైయస్ఆర్ సీపీకి @samajwadiparty మద్దతు ఇస్తుంది. -రామ్ గోపాల్ యాదవ్ గారు, సమాజ్ వాదీపార్టీ ఎంపీ#YSRCPProtestsInDelhi#SaveAPFromTDP pic.twitter.com/GcLnXEwIdn — YSR Congress Party (@YSRCParty) July 24, 2024 అయితే.. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం జగన్ ధర్నాకు దూరంగా ఉంది. ఇప్పటిదాకా ఇండియా, ఎన్డీఏ కూటములకు వైసీపీ దూరంగా ఉంటూ వచ్చింది. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకే రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ప్రకటించింది వైసీపీ. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీకి నేరుగా మద్దతు ఇవ్వకపోయినా.. అనేక బిల్లుల్లో సపోర్ట్ ఇచ్చింది. ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలోనూ ఎన్డేఏకే మద్దతు ఇచ్చింది వైసీపీ. Also Read: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్ నడిరోడ్డుపై వైయస్ఆర్ సీపీ కార్యకర్తను చంపిన విధానం భయంకరంగా ఉంది.. వైయస్ఆర్ సీపీకి @AamAadmiParty పూర్తి మద్దతు ఇస్తుంది. -రాజేంద్ర పాల్ గౌతం గారు, అమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి#YSRCPProtestsInDelhi#SaveAPFromTDP pic.twitter.com/etwxoj0Qfw — YSR Congress Party (@YSRCParty) July 24, 2024 తాజాగా ఇండియా కూటమి నేతలు జగన్ దీక్షలో పాల్గొనడంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందా? అన్న చర్చ ప్రారంభమైంది. గత ఎన్నికల్లో ఏ కూటమిలో లేని వైసీపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఏదో ఓ కూటమిలో చేరాలన్న నిర్ణయానికి వైసీపీ వచ్చిందా? అన్న చర్చ సాగుతోంది. అయితే.. ఎన్డీఏలో టీడీపీ కీలకంగా మారడంతో వైసీపీ ఇండియా కూటమి వైపు చూస్తుందా? అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. Honorable National President Shri Akhilesh Yadav ji joined the protest being organized by YSR Party at Jantar Mantar, Delhi against the anarchy happening in Andhra Pradesh and former Chief Minister Shri Jagan Mohan Reddy@yadavakhilesh @ysjagan pic.twitter.com/Qf4h5QeMfW — I-N-D-I-A (@_INDIAAlliance) July 24, 2024 అయితే.. ఈ రోజు జగన్ ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీలు హాజరు కాగా.. కూటమిలోని ముఖ్య పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జగన్ సోదరి షర్మిల ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ దారుణ పరాజయం తర్వాత కూడా షర్మిల అన్న జగన్ పై విమర్శల దాడి ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఇండియా కూటమిలోకి వెళ్తారా? లేక ఇప్పటిలాగా రెండు కూటములకు సమదూరంలో ఉంటారా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. Also Read: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా…? #ys-jagan #india-alliance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి