Chandrababu: ఐటీ నోటీసుల వార్త నిజమా? కాదా? చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైర్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులు జారీచేశారనే వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. By BalaMurali Krishna 01 Sep 2023 in విజయవాడ రాజకీయాలు New Update షేర్ చేయండి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులు జారీచేశారనే వార్తల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. రా...కదలి రా ! ఐటీ పిలుస్తుంది. చంద్రబాబు అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. రా ...కదలి రా ! ఐటీ పిలుస్తుంది !! @ncbn — Ambati Rambabu (@AmbatiRambabu) September 1, 2023 ఇక అవినీతి చక్రవర్తి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన ఆర్థిక నేరాలు బహిర్గతమయ్యాయని.. తాను నిజాయితీపరుడనని.. ఈ కథనాలు రాసిన పత్రికపై కేసు వేయడానికి చంద్రబాబు లేదా లోకేష్ ముందుకు వస్తారా? అని మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ముడుపుల వ్యవహారంపై పత్రికలో వచ్చిన వార్తలను ఖండించకపోవడాన్ని బట్టి చూస్తే, అవన్నీ నిజమేనని స్పష్టమవుతోందన్నారు. గతంలో తాను అసెంబ్లీలో ఇదే అంశంపై అన్ని ఆధారాలతో సుమారు 45 నిమిషాలు మాట్లాడానని అమర్నాథ్ తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలన్నా కుదర్లేదని వెల్లడించారు. అడ్డంగా బుక్కైనా సరే బుకాయించడం బాబు గారి నైజం అని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారు చంద్రబాబు గారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలనుకున్నా కుదర్లేదు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు గారి నైజం. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 1, 2023 తాత్కాలిక రాజధాని పేరుతో చంద్రబాబు ముడుపులు కొట్టేశారని, ఆయన గుట్టును ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ బయటపెట్టిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేశారో బయటపడిందని.. ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టులతో రూ.118 కోట్ల ముడుపులు అందాయన్నారు. హిందూస్థాన్ టైమ్స్‌లో వచ్చిన వార్త నిజమా? కాదా? చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూస్థాన్ టైమ్స్ తప్పుడు వార్తలు రాసిందా? లేక చంద్రబాబు అమాయకులా? అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజం కాదా? ఇందులో ముడుపులు తిన్నారా? లేదా? ఇన్‌కం ట్యాక్స్ సెప్టెంబర్ 22న నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు పెదవి విప్పలేదు? హిందుస్థాన్ టైమ్స్‌పై పరువు నష్టం దావా వేసే దమ్ముందా? వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇన్‌ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ రూ.118 కోట్లు ముడుపులు తీసుకున్నారనే అభియోగాల కింద చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు హిందూస్థాన్ టైమ్స్ జాతీయ దినపత్రిక పేర్కొంది. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారని ఆ ఆర్టికల్‌లో వివరించారు. చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2019లో ఐటీ శాఖ అధికారులు చంద్రబాబు పీఏగా శ్రీనివాస్ నివాసంలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి