/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/YCP-MEETING.jpg)
YCP Meeting: తాడేపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. సమావేశానికి ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కానున్నారు. బెంగళూరు నుండి రావాల్సిన ఎయిరిండియా విమానం రద్దు అయింది. ఉదయం 7గంటల 50 నిమిషాలకు విమానం రద్దు అయినట్టు తెలుస్తోంది. విమానంలో పలువురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఇవాళ్టి వైసీపీ సమావేశానికి రాలేకపోతున్నామని నేతలు తెలిపారు. విమానంలో మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, హిందూపురం ఇంచార్జ్ దీపిక, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డితో పాటు పలువురు సీమ నేతలు ఉన్నారు.