YCP Election Campaign : 'సిద్ధం'లో మోగనున్న జగన్‌ ఎన్నికల శంఖారావం.. లక్షల్లో జనసమీకరణ!

ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 'సిద్ధం' పేరుతో భారీ సభలను తలపెట్టాలని వైసీపీ నిర్ణయించినా ఇవాళ భీమిలి వేదికగా తొలి సభ జరగనుంది. ఇదే సభ నుంచి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. సభకు రెండు లక్షల మందికి పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా.

YCP Election Campaign : 'సిద్ధం'లో మోగనున్న జగన్‌ ఎన్నికల శంఖారావం.. లక్షల్లో జనసమీకరణ!
New Update

YCP Election Campaign Starts From Bheemili : ఏపీ సీఎం, వైఎస్‌ జగన్‌(Jagan) ఇవాళ(జనవరి 27)భీమిలి(Bheemili) నియోజకవర్గంలోని సంగివలసలో కార్యకర్తలు, నాయకులతో తొలి ప్రాంతీయ సమావేశానికి రంగం సిద్ధమైంది. ఈ సమావేశానికి 'సిద్ధం'(Siddham) అని పేరు పెట్టారు . ఈ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మందికి పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా. ఉత్తరాంధ్ర రీజినల్ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy), మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), తదితర ప్రముఖ నేతలు 18 ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు వైఎస్సార్సీ నాలుగు 'సిద్ధం' సమావేశాలను ప్లాన్ చేసింది. 'మిషన్ 175'తో ముందుకు వచ్చిన వైసీపీ(YCP).. 2019 ఎన్నికల మాదిరిగానే తన ఎన్నికల ప్రచారాన్ని కిక్‌స్టార్ట్ చేయడానికి ఉత్తర ఆంధ్రను ఎంచుకుంది. ఏపీలోని అన్ని ప్రధాన నగరాల్లో 'సిద్ధం' హోర్డింగ్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అటు సోషల్‌మీడియాలోనూ వైసీపీ మద్దతుదారులు జగన్‌కు సపోర్ట్‌గా ట్రెండింగ్‌లు చేస్తున్నారు. భీమిలిలో జరగనున్న తొలి సమావేశానికి ఉత్తర ఆంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైఎస్‌ఆర్‌సి కేడర్‌ హాజరుకానుంది.

Also Read : Pawan : ఇప్పుడు కుల గణన ఎందుకు?.. సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ

తనపై తన తోబుట్టువు(YS Sharmila) మాటల దాడితో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎలా కుట్ర పన్నుతున్నాయో సభా వేదికగా సీఎం జగన్ వివరిస్తారు. జగన్‌పై దాడికి అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారని.. బయటి వ్యక్తులు రాష్ట్రానికి వచ్చి జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారుని సుబ్బారెడ్డి ఆరోపించారు. జగన్ పై షర్మిల చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. అటు వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని, మరో సారి అధికారాన్ని కోరుతుందని మంత్రి బొత్స అన్నారు.

Also Read: బడ్జెట్‌ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి!

WATCH:

#ys-jagan #bheemili #siddham
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe