Visakha: విశాఖలో టీడీపీ వైసీపీ పార్టీల ఫైట్ హోరాహోరీగా ఉంటుంది. ఇప్పటికే ఎవరికివారు ఇంటింటి ప్రచారాల్లో జోరుగా ఉన్నారు. ముందుగా విశాఖ నార్తుల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఇక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు కేకే రాజు పై గెలుపొందారు. మళ్లీ ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో కేకే రాజ్ కే వైసీపీ నుండి సీట్ ఇవ్వడంతో తమ పార్టీనే గెలుస్తుందని ధీమాలో ఉంది అధిష్టానం. నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం వైసీపీకి కలిసొచ్చే అంశం.
టీడీపీకి చెక్
ఇక్కడ టీడీపీ మాత్రం క్యాడర్ కూడా లేని పరిస్థితి రావడంతో గెలుపు పక్క అంటుంది వైసీపీ. అలాగే విశాఖ తూర్పు నియోజకవర్గంలో 3 సార్లు గా ఇది టీడీపీ బలమైన స్థానం అని చెప్పవచ్చు. వెలగపూడి రామకృష్ణ బాబుతో ఎవరు పోటీపడిన ఓటమి పాలవుతున్నారు. ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఒకే సామాజిక వర్గాన్ని ఉన్న వ్యక్తిని పెట్టడంతో ఇది కూడా గెలుపు పై అంచనా వేస్తుంది అధిష్టానం. విశాఖ ఎంపీగా ఉన్న ఎం వివి సత్యనారాయణ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ జోరుగా ప్రచారం కొనసాగుతున్నాడంతో టీడీపీకి చెక్ పెట్టవచ్చని వైసీపీ వర్గాలు అనుకుంటున్నాయి.
Also Read: ఇలాంటి వారు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు?.. అన్న జగన్ ను టార్గెట్ చేసిన షర్మిల..!
వింత పరిస్థితి
విశాఖ దక్షిణలో వైసీపీకి వింత పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీలోనే వర్గాలు ఉండడంతో ఓటు బ్యాంకుపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 2019లో టీడీపీ తరఫున గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లడంతో ఆ పార్టీలోనే ఉన్న నేతలు కార్పొరేటర్లు ఆయనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ కే అధిష్టానం టికెట్ నిర్ణయం ఉంటుందని సంకేతాలు ఉన్న కొంతమంది వైసీపీ నేతలు మాత్రం హాస్పిటల్ కి టికెట్ వద్దంటూ ఆందోళనకరణ వాతావరణం తీసుకొని రావడంతో ఈ నియోజకవర్గం ఒక తలనొప్పిగా స్థానానికి మారింది.
గెలుపు ధీమా
ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ జెండా ఎగరవేయాలని పక్క ప్రణాళికతో వాసుపల్లి గణేష్ కుమార్ ముందుకు వెళ్తున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ ను ఇంచార్జి గా నియమించడంతో ఎట్టి పరిస్థితి ల్లో నాలుగు దిక్కులో వైసీపీ గెలవాలని తీవ్రమైన కసరత్తు చేస్తుంది అధిష్టానం. ఎంపీ అభ్యర్థి కూడా మంత్రి బొత్స సతీమణి ప్రవేశ పెట్టడంతో పూర్తిస్థాయిలో అధికార పార్టీనే గెలుస్తుందన్న ధీమాలో ఉంది. 24 ఎన్నికల్లో సాగర్ తీరంలో వైసీపీ పాగా వేస్తుందా లేదా తుడిచిపెట్టుకుపోతుందా? అనేది ఎదురు చూడాలి.