/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/JAGAN-4.jpg)
YS Jagan Defeat:ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. వైసీపీ ఓటమిని తట్టుకోలేక కొందరు అభిమానులు మృతి చెందారు. కృష్ణా జిల్లా గుడివాడ సైదేపూడికి చెందిన పిట్ట అనిల్ (28) జగన్ ప్రభుత్వం, కొడాలి నాని ఓటమి చెందడం తట్టుకోలేక ఫ్యాన్‌ను ఉరేసుకుని చనిపోయాడు. వైఎస్సార్ జిల్లా దిగువ తంబళ్లపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త చిన్నయల్లాలు(63) వైసీపీ ఓటమి వార్త విని గుండెపోటుతో చనిపోయాడు. కర్నూలు జిల్లా చిన్నతంబళంలోనూ ఉరుకుందప్ప(68) టీవీ చూస్తూ జగన్ ప్రభుత్వ ఓటమిని తట్టుకోలేక తుదిశ్వాస విడిచారు.
Follow Us