AP Politics : మద్యం తాగే వారు మాకు ఓటు వేయలేదు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో బ్రాండెడ్ మద్యం దొరకకపోవడం తమ ఓటమిలో కీలక పాత్ర పోషించిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంకా ఇసుక కొరత కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోవడం కూడా తమను దెబ్బకొట్టిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రభావం కూడా నష్టం చేసిందన్నారు. By Nikhil 23 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి YCP : అవమానం, ఇసుక కొరత, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act), బ్రాండెడ్ మద్యం (Branded Liquor) దొరకకపోవడం తదితర కారణాలు వైసీపీ (YCP) ఓటమిలో కీలక పాత్ర పోషించాయని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఓటమికి మూడే మూడు కారణాలు ఉన్నాయని కార్యకర్తలు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బ్రాండెడ్ లిక్కర్ దొరకక పోవడంతో పాటు, నాసిరకం బ్రాండ్లు తయారు చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ప్రజల్లోకి టీడీపీ (TDP) వారు బాగా తీసుకు వెళ్లారన్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై పడిందన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న వారు వైసీపీకి ఓటు వేయలేదన్నారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీని మార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఇసుక ధర భారీగా పెంచడంతో నిర్మాణ కార్మికులపై పడిందన్నారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ప్రజల ఆస్తులను భరోసా ఉండదు అని క్షేత్ర స్థాయిలోకి టీడీపీ నెగటివ్ ప్రచారం తీసుకెళ్లిందన్నారు. 2019 లో జగన్ గెలవడానికి, 2024లో చంద్రబాబు గెలవడానికి ప్రధాన కారణం అవమానమేనన్నారు. 2014 లో కాంగ్రెస్ జగన్ ను అవమానించి కేసులు పెట్టి జైల్లో వేయించిందన్నారు. ఆ అవమానం కసితో నాయకులు కార్యకర్తలు కసితో పనిచేసి 2019 లో జగన్ ను అత్యధిక సీట్లతో గెలిపించుకున్నారన్నారు. చంద్రబాబు ను కూడా అవమానించి జైల్లో పెట్టడంతో కార్యకర్తలు, నాయకులు కసితో పనిచేసి అత్యధిక సీట్లతో గెలిపించుకున్నారన్నారు. అవమానం జరిగిన వారు కసిగా పనిచేసి విజయం సాధిస్తారని రామాయణం, మహాభారతం చెబుతున్నాయన్నారు. Also Read : హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం #ap-ycp #ap-tdp #land-titling-act #branded-liquor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి