Ananthapuram: అనంతపురంలో రోడ్డెక్కిన వైసీపీ కార్పొరేటర్లు

అనంతపురంలో వైసీపీ కార్పొరేటర్లు, మహిళలు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. రెండు నెలల నుంచి తమ కాలనీలకు తాగునీరు సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Ananthapuram: అనంతపురంలో రోడ్డెక్కిన వైసీపీ కార్పొరేటర్లు

Ananthapuram: అనంతపురం నగరంలో తాగునీటి కోసం వైసీపీ కార్పొరేటర్లు, మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. తక్షణమే మంచి నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని పలు కాలనీల మహిళలు, వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతోనూ, మట్టి కుండలతో మున్సిపల్ కార్యాలయం ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తోంది : షర్మిల

రెండు నెలల నుంచి తమ కాలనీలకు తాగునీరు సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం పలుమార్లు అధికారులను విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎండకాలం కావడంతో తాగడానికి నీరు లేక మరింత తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

Also Read: టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై..!

ప్రభుత్వం తమ సమస్యపై పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 12వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ జనబలం బాబా, 23వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ హరిత, వైసీపీ నాయకులు మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించనప్పుడు ఎన్నికల్లో ఓటు వేయండని ప్రజలను ఎలా అడగాలంటూ కార్పొరేటర్లు వైసీపీ పెద్దలను నిలదీస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Watch This Video:

Advertisment
తాజా కథనాలు