YCP Chief Jagan: స్పీకర్‌కు మాజీ సీఎం జగన్ లేఖ

AP: స్పీకర్‌కు జగన్‌ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం చేయించడం సభాసంప్రదాయానికి విరుద్ధం అని అన్నారు. స్పీకర్‌ ఇప్పటికే తనపట్ల శతృత్వం ప్రదర్శిస్తున్నారని.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని లేఖలో ప్రస్తావించారు.

YCP Chief Jagan: స్పీకర్‌కు మాజీ సీఎం జగన్ లేఖ
New Update

YCP Chief Jagan Letter To AP Speaker: అసెంబ్లీ స్పీకర్‌కు వైసీపీ అధినేత జగన్‌ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం చేయించడం సభాసంప్రదాయానికి విరుద్ధం అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని పేర్కొన్నారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని తెలిపారు. పార్లమెంటులో కానీ, ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధన పాటించలేదని పేర్కొన్నారు. స్పీకర్‌ ఇప్పటికే నాపట్ల శతృత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పారు.

చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ (Ayyannapatrudu) మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని గుర్తు చేశారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరారు.

#ys-jagan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe