AP Politics: 11 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ల మార్పు.. వైసీపీ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ మొదలైంది. సోమవారం పలువురు కీలక నేతలు పార్టీని వీడగా, అదే రోజు సాయంత్రం 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చింది.

New Update
AP Politics: 11 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ల మార్పు.. వైసీపీ సంచలన నిర్ణయం

New coordinators for YCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ మొదలైంది. సోమవారం పలువురు కీలక నేతలు పార్టీని వీడగా, అదే రోజు సాయంత్రం 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. వివిధ నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చింది. సోమవారం సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల ప్రభావంతో వైసీపీ (YSRCP) అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

సిట్టింగులను మార్చడం కూడా అధిష్టానం వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో గెలుపే తమ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) స్పష్టంచేశారు. విజయావకాశాలను బట్టి నియోజకవర్గాల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జులను కూడా మార్చినట్లు ఆయన వెల్లడించారు.

అభ్యర్థుల జాబితా: 

మంగళగిరి - గంజి చిరంజీవి

చిలకలూరిపేట - మల్లెల రాజేశ్ నాయుడు

గుంటూరు వెస్ట్ - విడదల రజిని

కొండేపి (ఎస్సీ) - ఆదిమూలపు సురేశ్

తాడికొండ (ఎస్సీ) - మేకతోటి సుచరిత

వేమూరు (ఎస్సీ) - వరికూటి అశోక్ బాబు

సంతనూతలపాడు (ఎస్సీ) - మేరుగు నాగార్జున

పత్తిపాడు - బాలసాని కిరణ్ కుమార్

అద్దంకి - పాణెం హనిమి రెడ్డి

రేపల్లె - ఈపూరి గణేశ్

గాజువాక - వరికూటి రామచంద్రరావు

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు