ఓటమి భయంతోనే దాడులకి తెగబడ్డారు: లోకేష్ వైసిపి నేతలు ఓటమి భయంతోనే టిడిపి నేతలపై దాడులకి తెగబడుతున్నారని లోకేష్ ఆరోపించారు. భీమవరం టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు మునిరత్నంపై వైసీపీ చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం దారుణమని మండిపడ్డారు. By Jyoshna Sappogula 10 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Nara Lokesh: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయి ప్రవర్తించారు. భీమవరం టీడీపీ గ్రామ కమిటీ సభ్యుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ నేతలు బండరాళ్లతో దాడికి తెగబడ్డారు. మూలపల్లెకు చెందిన ఈశ్వరి.. ఆమె మామ అన్నారెడ్డిలకు పొలం వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఈశ్వరి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే ఈశ్వరికి మద్దతుగా భీమవరం టీడీపీ గ్రామ కమిటీ సభ్యుడు మునిరత్నం వచ్చారు. అన్నారెడ్డికి మద్దతుగా వైసీపీ నేత కోటాల చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు.అయితే, ఈ వివాధం క్రమంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా, ఈ ఘటనపై నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. Also Read: పాలిటిక్స్, కబడ్డి.. సేమ్ టూ సేమ్..మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..! వైసిపి నేతలు ఓటమి భయంతో టిడిపి నేతలపై దాడులకి తెగబడుతున్నారు. చంద్రగిరి మండలం భీమవరం టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ నేత కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం దారుణం. మునిరత్నం నాయుడు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలి, అన్ని… — Lokesh Nara (@naralokesh) November 10, 2023 వైసిపి నేతలు ఓటమి భయంతోనే టిడిపి నేతలపై దాడులకి తెగబడుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. చంద్రగిరి మండలం భీమవరం టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడుపై వైసీపీ నేత కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం దారుణమని మండిపడ్డారు. మునిరత్నం నాయుడు పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలి, అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వైసిపి ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. #lokesh #ycp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి