Vishaka: ఏపీలో వైసీపీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. మాచర్ల తోపాటు విశాఖలోనూ మారణహోమానికి తెరలేపారంటూ మండిపడుతున్నారు. వైసీపీకి ఓటు వేయలేదని విశాఖ నూకాలమ్మ ఆలయం వద్ద ఇద్దరు మహిళలు, యువకుడిపై విచక్షణ రహితంగా వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వైసీపీ-టీడీపీ కార్యకర్తల ఇళ్లలో పెట్రోల్ బాంబులు.. దాడుల కుట్రల వెనుక..
బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించిన టీడీపీ నేతలు.. వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటమి తప్పదని ఫస్ట్రేషన్ లో వైసీపీ నాయకులు డిప్రెషన్ లోకి వెళ్లి ఇలా దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతున్నారన్న బాధ కన్నా ఓడిపోతే ప్రజలు తిరగబడతారన్న భయం వైసీపీలో స్పష్టంగా కనపడుతుందన్నారు. ప్రశాంతమైన విశాఖలో వైసీపీ అరాచకశక్తులను ప్రజలు సహించబోరని తగిన బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.