YCP Amzath Basha: కడప వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. పోలింగ్ పెరిగిందంటే వైసీపీదే విజయం అంటున్నారు. కానీ, పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి తామే గెలుస్తామనే భ్రమలో టీడీపీ ఉందని విమర్శలు గుప్పించారు. మహిళా ఓటర్లు వైసీపీ వైపే ఉన్నారన్నారు.
Also Read: కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ ఓడిపోతాయి.. సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు
ప్రశాంతంగా పోలింగ్ ముగిసే సమయంలో కావాలనే టీడీపీ రాళ్ల దాడికి దిగిందని ఆరోపించారు. మతపరమైన వివాదాన్ని సృష్టించి లబ్ది పొందాలని చూశారన్నారు. కడప ప్రజలు తెలివైన వారని.. అల్లర్లు సృష్టించే వారిని ప్రోత్సహించరని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న కడపలో అశాంతి రేకేతించే విధంగా టీడీపీ అభ్యర్థి వ్యవహారించారన్నారు.
Also Read: కర్నూలు శివారులో హిజ్రాల మృతదేహాలు.. ఎక్కడివి?
ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంటే గొడవలు సృష్టించాలని చూశారని..తమ కార్యకర్తలు సంయమనంతో వ్యవహారించి పోలింగ్ పైనే దృష్టి పెట్టారన్నారు. మొదట రాళ్లతో దాడి చేసింది టీడీపీ కార్యకర్తలేనని ఆరోపించారు. తన వాహనం అద్దాలను ధ్వసం చేయడంతో ప్రతి స్పందనగా తమ వాళ్ళు రాళ్ల దాడి చేశారన్నారు.