Yanamala Ramakrishnudu: ఢిల్లీలో జగన్ ధర్నాపై మాజీ మంత్రి యనమల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండి కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. జగనుకు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలని.. ఇండి కూటమికి కూడా పార్టీలు కావాలని అన్నారు. ధర్నాకు ఇండి కూటమి పార్టీలు రావడమే దీనికి సంకేతం అని చెప్పారు. ఇండి కూటమిలో చేరడం జగన్‌కి అనివార్యం అని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ బీజేపీని అడ్డం పెట్టుకుని జగన్ పబ్బం గడుపుకున్నారని విమర్శించారు.
ఇప్పుడు ఎన్డీఏలో మేం, జనసేన ఉన్నాం అని.. ఎన్డీఏ కూటమిలోకి జగన్ రాలేని పరిస్థితి అని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూటమి పార్టీగా జగన్ ఇండియాలో భాగస్వామిగా ఉండబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇండి కూటమిలో చేరేంత ధైర్యం జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు విష్ణుకుమార్ రాజు. అంత సాహసం చేస్తాడని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు.