Yanamala: జగన్ జైలుకు పోవడం ఖాయం: యనమల నిరాధారమైన ఆధారాలతో టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రపంచంలోనే రాష్ట్రాన్నికి గుర్తింపు తెచ్చిన వ్యక్తిని జైలులో పెట్టినందుకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. By BalaMurali Krishna 17 Sep 2023 in తూర్పు గోదావరి రాజకీయాలు New Update షేర్ చేయండి Yanamala: నిరాధారమైన ఆధారాలతో టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రపంచంలోనే రాష్ట్రాన్నికి గుర్తింపు తెచ్చిన వ్యక్తిని జైలులో పెట్టినందుకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సీమెన్స్ సంస్ధ ద్వారా నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పందం పెట్టుకున్నామని తెలియాజేశారు. దీని ద్వారా చదువుకున్న నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గజ దొంగ అని.. దాదాపు 16 నెలలు జైలులో ఉన్నటువంటి నాయకుడికి ప్రజలు అధికారం ఇచ్చారంటూ ఘాటు విమర్శలు చేశారు. జగన్ చేసిన లక్ష కోట్ల రూపాయల అవినీతిలో 43 వేల కోట్ల రుపాయలను ఇప్పటికే సీబీఐ గుర్తించిందన్నారు. గజదొంగ అతని గ్యాంగ్ స్టార్స్ అంతా ఇసుక, మైన్స్, లిక్కర్ ద్వారా దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థకు అధిపతిగా జగన్ ఉన్నారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఉపాధి లేదని.. అరాచకాలే జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే 23 ఛార్జి షీట్లు జగన్‌పై పెండింగులో ఉన్నాయని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కచ్చితంగా ఇంటికి పోవడం ఖాయంమని.. పోతూ పోతూ జైలుకు కూడా పోవడం ఖాయమని యనమల ఎద్దేవా చేశారు. సొంత తల్లి, చెల్లిని, కుటుంబాన్ని జగన్ మోసం చేశారన్నారు. రాష్ట్రానికి భవిష్యత్తు లేదు.. భవిష్యత్తు కోరుకునే వారందరూ చంద్రబాబుకు ఓటేయాలని యనమల పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు: రామకృష్ణ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి