/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/yanamula-jpg.webp)
Yanamala Rama Krishnudu: ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అవినీతి చేశారని..అవినీతి అనుకొండ అని..ఇలా వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. అయితే, వైసీపీ మంత్రుల మాటలకు టీడీపీ యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)గట్టి కౌంటర్ ఇచ్చారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన సీఎం జగనే అసలైన ఆర్థిక నేరస్తుడని టీడీపీ యనమల రామకృష్ణుడు ఘాటుగా స్పందించారు.
అసలైన ఆర్థిక నేరస్తుడు సీఎం జగన్ అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని బినామీ లావాదేవీలతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఆర్థిక నేరస్తుడిగా చూపించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కేవలం ఒక్క రోజైనా చంద్రబాబును జైల్లో పెట్లాలనే ఆతృత తప్ప ఈ కేసులో ఏమాత్రం పస లేదని ఎద్దేవా చేశారు.
యువతకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ తీసుకొచ్చారని..ఈ స్కామ్ తో ఎంతో మంది యువతి యువకులు ఉపాధి పొందారని అన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో కనీసం పెట్టుబడులు పెట్టాడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదని యనమల రామకృష్ణుడు అరోపించారు. యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ లండన్ ఎందుకు వెళ్లారో చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. లండన్ నుంచి తిరిగొస్తున్న ఆయనకు రిటర్న్ గిఫ్ట్ గా చంద్రబాబును అరెస్ట్ చేశారు తప్ప ఇందులో ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. చంద్రబాబుకు హాని జరిగితే సీఎం జగన్ బాధ్యత వహించాలని చెప్పారు. అహం, కోరిక, పరిపాలన కాంక్షతో దుర్యోధనుడు నాశనం అయ్యాడని..అలాగే జగన్ రెడ్డి కూడా ఇదే దారిలో వెళ్తున్నారని అన్నారు. జగన్ బినామీ ట్రాన్సాక్షన్స్ తన దగ్గర ఉన్నాయని, సందర్భం వచ్చినప్పుడు బయటపెడతామని చెప్పారు.అచ్చం రాజారెడ్డి లాగే ప్రజల ఆస్తులు దోచుకొని కోట్లు సంపాధిస్తున్నాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని యనమల అన్నారు.
Also Read: చంద్రబాబుకు మరో షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పిటిషన్