గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్ లో యమునోత్రి, బద్రీనాథ్ హైవేపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పెద్దపెద్ద బండరాళ్లు పడి రోడ్లన్నీ బ్లాక్ కావడంతో అప్రమత్తమైన అధికారులు యమునోత్రి యాత్రను నిలిపివేశారు. దీంతో యాత్రికులతో పాటు స్థానికులు చాలామంది అక్కడే చిక్కుకుపోయారు.
దీంతో యమునోత్రి తీర్థయాత్రకు బ్రేక్ పడింది. కాగా, సోమవారం ఉదయం పర్వతాల నుంచి పెద్ద బండరాళ్లు హైవేపై పడిపోయాయి. దీంతో యాత్రికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు వర్షాల కారణంగా బద్రీనాథ్ యమునోత్రి హైవే పూర్తిగా కొట్టుకుపోయింది. అధికారులు హైవేను బ్లాక్ చేశారు.
దీంతో ప్రయాణికులు హైవేకి ఇరువైపులా చిక్కుకుపోవాల్సి వచ్చింది. అయితే ఉత్తర కాశీ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. కాగా, ఎడతెరిపి లేకుండా ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఉత్తర్ ప్రదేశ్ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
గుజరాత్ లో తుపాన్ తరువాత వెంటనే ఈ రాష్ట్రాల్లో కుంభవృష్టి పడడం మొదలైంది. రెండు మూడు రోజులు మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్లీ ఉత్తరాఖండ్ లో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.