ఉప్పొంగిన యమునా..ప్రమాదకరస్థాయిలో నీటి ప్రవాహం..!! ఉత్తరాదిన వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత మూడు రోజులుగా కుండపోతగా కురిసిన నేపథ్యంలో ఢిల్లీలోని యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న హర్యానా నుంచి భారీగా వరద పోటెత్తుతుండటంతో నది నీటిమట్టం ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది. By Bhoomi 12 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీలోని యమునా నది ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరదనీరు భారీగా చేరడంతో యమునా నది డేంజర్ జోన్లో ఉంది. అయితే మంగళవారం ఢిల్లీలో వాతావరణంలో కొద్దిగా మార్పులు కనిపించాయి. మబ్బులు ఉన్నప్పటికీ వర్షం కురవలేదు. ఉష్ణోగ్రతలో స్వల్ప పెరుగుదల కూడా కనిపించింది. రానున్న మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదైంది. గాలిలో తేమ స్థాయి 100 నుండి 74 వరకు ఉంది. వర్షం విషయానికొస్తే, లోధి రోడ్డులో చిరుజల్లులు కురిసాయి. బుధవారం కూడా రోజంతా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బుధ, గురు, శుక్రవారాల్లో వాతావరణం దాదాపు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అటు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మంగళవాం మధ్యాహ్నానికి నీటి మట్టం 206 మీటర్లు దాటింది. నది ఒడ్డున ఉండే సమీప లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదిపై ఉండే పాత రైల్వే బ్రిడ్జిని మూసివేసినట్లు...ఢిల్లీకి వరద పరిస్థితి లేదని తెలిపారు మంత్రి సౌరవ్ భరద్వాజ్. హిమాచల్‌ప్రదేశ్‌లో చిక్కుకున్న పర్యాటకులు: హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. మనాలిలో వరదల కారణంగా రోడ్లు తెగిపోయాయి, విద్యుత్, ఇంటర్నెట్‌ను నిలిచిపోయింది.మనాలిలో చిక్కుకున్న పర్యాటకులను డ్రోన్ ద్వారా వీడియో తీశారు. సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మనాలిలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. స్పితి జిల్లా చందేత్రల్ లోని క్యాంపులో 300మంది పర్యాటకులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి