ఢిల్లీలో వరదలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరదల కారణంగా వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యమునా తీర ప్రాంతాలన్నీ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. గత కొన్ని రోజులుగా, ఢిల్లీతో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా యమునా నది నీటి మట్టం పెరిగింది. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. అయితే ఆదివారం అర్థరాత్రి యమునా నది నీటిమట్టం ప్రమాద స్థాయికి దిగువకు చేరుకుంది.
పూర్తిగా చదవండి..ప్రమాదకర స్థాయిలో యమునా నది…వరద నీటిలో ఎర్రకోట, తాజ్ మహల్..!!
భారీ వర్షాలు ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారీ వర్షాలకు తోడుగా వరదలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితోడుగా యమునా నది ఉప్పొంగి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది.

Translate this News: