ప్రమాదకరస్థాయిలో యమునా నది, సీఎం అత్యవసర సమావేశం..!! ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో యమునా నది నీటిమట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. IMD ప్రకారం, ఆదివారం ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది 1982 తర్వాత కురిసిన అత్యధిక వర్షాపాతంగా రికార్డులోకి ఎక్కింది. By Bhoomi 12 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యమునా నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ఉప్పెన కారణంగా, యమునా నీటి మట్టం 207.25 మీటర్లకు పెరిగింది. ఇది 1978 నుండి అత్యధిక రికార్డు స్థాయి 207.49కి దగ్గరగా ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం, పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటి మట్టం 2013 తర్వాత 4 గంటలకు మొదటిసారిగా 207 మీటర్ల మార్కును దాటింది. బుధవారం ఉదయం 8 గంటలకు 207.25 మీటర్లకు పెరిగింది. నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి నది నీటిమట్టం 207.35 మీటర్లకు చేరుకుంటుందని, అది మరింతగా పెరుగుతుందని తెలిపారు. 2013 తర్వాత అత్యధికం: ఢిల్లీలో గత 3 రోజులుగా యమునా నీటి మట్టం వేగంగా పెరిగింది. ఆదివారం ఉదయం 11 గంటలకు 203.14 మీటర్ల నీటిమట్టం నమోదవగా, అంచనా వేసిన దానికంటే 18 గంటల ముందుగానే 205.33 మీటర్ల ప్రమాదకర స్థాయిని దాటింది. యమునా నీటి మట్టం సోమవారం రాత్రి 206 మీటర్ల మార్కును తాకింది. వరద పీడిత ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. రోడ్డు, రైలు ట్రాఫిక్ కోసం పాత రైల్వే వంతెనను మూసివేశారు. CWC డేటా ప్రకారం, యమునా నది ప్రస్తుత నీటి మట్టం 2013 నుండి అత్యధికంగా ఉంది. యమునా 207.32 మీటర్ల స్థాయికి చేరుకుంది. సహాయక చర్యల కోసం 45 బోట్లు: ఢిల్లీతోపాటు పొరుగు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగిందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. సహాయక చర్యల కోసం 45 బోట్లను మోహరించినట్లు తెలిపారు. దీనితో పాటు నిరాశ్రులైన ప్రజలకు సాయం అందించేందుకు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చాయి. పాత రైల్వే బ్రిడ్జిని మూసివేశారు. అలాగే అదనపు నీటిని విడుదల చేయడానికి, అధిక నీటి మట్టాన్ని నిరోధించడానికి ఓఖ్లా బ్యారేజీకు సంబంధించిన అన్ని గేట్లను తెరిచినట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు: నీటిమట్టం ఇలాగే పెరిగితే ప్రమాదకర హెచ్చరికలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. సంబంధిత జిల్లాల జిల్లా మేజిస్ట్రేట్‌లు, వారి సెక్టార్ కమిటీలు ఈ పని కోసం అప్రమత్తంగా ఉన్నారని, నీటిపారుదల వరద నియంత్రణ విభాగం, ఢిల్లీ పోలీస్, ఢిల్లీ జల్ బోర్డు, ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు, ఇతర సంస్థలు ఈ సమస్యను ఎదుర్కోవటానికి దగ్గరగా పనిచేస్తున్నాయని డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీలో వరదల వంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదని, అయితే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వాయువ్య భారతదేశంలో గత 3 రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయని, దీని కారణంగా నదులు కాలువలు ఉప్పొంగుతున్నాయన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి