RX 100 Bike: త్వరలో మార్కెట్‌లోకి యమహా RX 100?..నిజంగానే వస్తుందా?

RX100 బైక్‌ ఒకప్పుడు భారత్‌లో మోటార్‌ సైకిల్ రంగాన్ని శాసించిందనే చెప్పాలి. ఇరుకైన రోడ్లపైనా బుల్లెట్‌గా దూసుకెళ్లడం ఈ బైక్‌ ప్రత్యేకత. యువత దీన్ని కొనేందుకు ఎక్కువ ఇష్టం చూపించేవారు. ఇక RX 100 బైక్‌ను త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

RX 100 Bike: త్వరలో మార్కెట్‌లోకి యమహా RX 100?..నిజంగానే వస్తుందా?
New Update

RX 100 Bike:1985లో భారతదేశంలో లాంచ్‌ అయిన యమహా RX100 బైక్‌ తరాల హృదయాలను దోచుకుంది. ఈ బైక్‌ అంటేనే యూత్‌ ఐకాన్‌ అనేవారు. దానికి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. కాలక్రమేణా RX100ని కంపెనీ ఆపేసింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

RX 100 అంటే పవర్‌:

RX100 బైక్‌ ఒకప్పుడు భారత్‌లో మోటార్‌ సైకిల్ రంగాన్ని శాసించిందనే చెప్పాలి. దీని డిజైన్‌ను యమహా కంపెనీ RD350 నుంచి తయారు చేశారు. 98cc, ఎయిర్-కూల్డ్ టూ-స్ట్రోక్ ఇంజన్‌తో ఈ బైక్‌ను తీసుకొచ్చారు. చూసేందుకు చిన్నగా ఉన్నా 11 హార్స్‌పవర్, 110 కి.మీ థ్రిల్లింగ్ టాప్ స్పీడ్‌ని అందించింది. ఇరుకైన రోడ్లపైనా బుల్లెట్‌గా దూసుకెళ్లడం ఈ బైక్‌ ప్రత్యేకత, యువత దీన్ని కొనేందుకు ఎక్కువ ఇష్టం చూపించేవారు.

publive-image

ప్రొడక్షన్‌ ఎప్పుడు ఆగిపోయింది..?

1996లో RX100 ప్రొడక్షన్‌ను కంపెనీ ఆపేసింది. అయినా ఇప్పటికీ ఈ బైక్‌ను సెకండ్‌ హ్యాండ్‌లో అయినా కొని మరమ్మతులు చేయించి ఉపయోగించేవారు ఉన్నారు. అంతటి క్రేజ్‌ సంపాదించుకుంది. అయితే మళ్లీ ఈ బైక్‌ మార్కెట్‌లోకి వస్తుందన్న వార్తతో మిగతా బైక్‌ కంపెనీలు ఒక్కసారి షాక్‌కి గురయ్యాయి. యూత్‌ ఆనందానికి అయితే హద్దు లేకుండాపోయింది. ఈసారి ఇంజిన్‌ కెపాసిటీ పెంచి, టెక్నాలజీతో విడుదల చేస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ మార్కెట్‌లోకి విడుదల చేస్తే మాత్రం టూస్టోక్‌ ఇంజిన్‌ కాకుండా మరిన్ని మార్పులతో తెస్తారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇతర బైక్‌లను తట్టుకునేలా దీన్ని తీసుకొస్తారని చెబుతున్నారు.

publive-image

కంపెనీ వర్గాలు ఏమంటున్నాయి..?

RX 100 బైక్‌ను త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేస్తారన్న వార్తలపై యమహా కంపెనీ అధికారికంగా ప్రకటన ఏమీ చేయలేదు. కానీ కొందరు వ్యాపారులు మాత్రం కంపెనీ బైక్‌ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందని, చిన్న చిన్న మార్పులతో బైక్‌ను విడుదల చేయొచ్చని, ఎప్పుడు విడుదల చేస్తారో మాత్రం క్లారిటీ లేదని అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్ రిలీజ్ ఎప్పుడు? ఇండియాలో మొత్తం మ్యాచ్‌లు సాధ్యమేనా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#rx-100-bike
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe