నేటి నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‎కు వై ప్లస్ కేటగిరీ భద్రత..!!

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వైఫ్లస్ కేటగిరీ సెక్యూరిటీని నేటి నుంచి తెలంగాణ సర్కార్ కల్పించనుంది. ఈటెల రాజేందర్ కు ఇదే వై కేటగిరి సెక్యూరిటీని కేంద్ర బలగాలతో కల్పించేందుకు కేంద్రప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఈటల రాజేందర్ కు ప్రాణహాని ఉందని తెలంగాణ సర్కార్ నిర్ధారించడంతో ఈ వై ప్లస్ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

New Update
నేటి నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‎కు వై ప్లస్ కేటగిరీ భద్రత..!!

మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఇవాళ్టి నుంచి వై ప్లస్ భద్రతను ఇవాళ్టి నుంచి  కల్పించనుంది తెలంగాణ సర్కార్. ఈటల ప్రాణానికి హాని ఉందని నిర్దారించిన తెలంగాణ ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం రాత్రి వెలువడ్డాయి. తనకు ప్రాణహాని ఉందంటూ ఈటల రాజేందర్ ఈ మధ్యే మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన భార్య జమున కూడా ఇదే విషయాన్నిమరోసారి స్పష్టం చేశారు.

EETELA RAJENDHAR

ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై గురించి ప్రస్తావించారు. ఈటల రాజేందర్ సెక్యూరిటీ బాధ్యత తనదంటూ చెప్పారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో డీజీపీ రంగంలోకి దిగారు. సీనియర్ ఐపీఎస్ సందీప్ రావుతో ఈటలకు ఎంత వరకు ముప్పు ఉందన్న అంశంపై ఆరా తీయాలన్నారు. ఒకటికి రెండుసార్లు ఈటల ఇంటికి వెళ్లిన డీసీపీ...కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరించారు. చుట్టుపక్కల తిరిగి చూశారు.

అనంతరం రిపోర్టు సీల్డ్ కవర్ ను డీజీపీకి అందజేశారు. మొత్తానికి ఈటల రాజేందర్ కు ప్రాణహాని ఉందని నిర్దారణకు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఈటలకు వైఫ్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 11మంది భద్రతా సిబ్బంది, ఈటెలకు సెక్యూరిటీగా ఉండనున్నారు. ఐదుగురు బాడీ గార్డ్స్ ఎప్పుడూ కూడా ఈటల వెంటే ఉంటారు. మరో ఆరుగురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్, ఫిష్ట్ కు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో ఈటలకు భద్రత కల్పించనున్నారు.

ఇవాళ ఉదయం నుంచి స్టేట్ కేటగిరి వై ప్లస్ భద్రతతోపాటు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఈటల రాజేందర్ కు 2ప్లస్ 2 సెక్యూరిటీ మాత్రమే ఉండేది.

Advertisment
Advertisment
తాజా కథనాలు