WWE: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ మైఖేల్ జాన్స్ కన్నుమూత..!!

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ స్టార్ రెజ్లర్, వర్జిల్ గా ప్రసిద్ధి చెందిన మైఖేల్ జాన్స్ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మైకేల్ స్నేహితుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

New Update
WWE: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ మైఖేల్ జాన్స్ కన్నుమూత..!!

Former WWE Superstar Michael Jones Passed Away:  వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ సూపర్ స్టార్ మైకేల్ జోన్స్ మరణించారు. డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచంలో వర్జిల్ గా ఆయన ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆయన వయస్సు 61ఏళ్లు. అనారోగ్యంతో ఆయన మరణించినట్లు మైకేల్ స్నేహితుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మనందరం ఎంతో ప్రేమించే మైఖేల్ జోన్స్, వర్జిన్, విన్సెంట్ , సౌల్ ట్రెయిన్ గా సుపరిచితుడైన మన స్నేహితుడు ఇక లేరన్న విషాద వార్తను దుఖంతో మీతో పంచుకుంటున్నా. వర్జిల్ ప్రశాతంగా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాల అంటూ మార్క్ చార్ల్స్ సంతాపం వ్యక్తం చేశాడు. డబ్ల్యూడబ్ల్యూఈ కూడా మైకేల్ జోన్స్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ అతడి కుటుంబం, అభిమానులకు సానుభూతిని ప్రకటించింది.

1962లో అమెరికాలోని పెన్సిల్వేనియాలో జన్మించిన మైఖేల్ జెన్స్ 1980వ దశకంలో సౌల్ ట్రైన్ జోన్స్ పేరుతో ప్రొఫెషనల్ రెజ్లర్ గా ఎదిగాడు. 1986లో డబ్ల్యూడబ్ల్యూఈల లూయిస్ బ్రౌన్ గా అడుగుపెట్టాడు. ఆ తర్వాత వర్జిల్ గా కొనసాగాడు. ఈమధ్య కాలంలో అనారోగ్యం బారిన పడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. మైఖేల్ కొలన్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. డిమెన్సియాతో కూడా బాధపడుతున్నాడు. గతంలో రెండు సార్లు గుండెపోటు కూడా వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

Also Read: అంబానీ కుటుంబానికి కాబోయే కోడలు ఏం చదువుకుందో తెలుసా?

Advertisment
తాజా కథనాలు