Gold ship: సముద్ర అలలపై తొలి బంగారు నౌక.. కళ్లు చెదిరే సౌకర్యాలు!

ప్రపంచంలోనే మొదటి బంగారునౌక జనాలను మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఆస్ట్రేలియా ఏకే రాయల్టీ కంపెనీ అధినేత ఆరన్‌ ఫిడ్లర్ కు చెందిన ఈ నౌకలో వస్తువులన్నీ 24 క్యారట్స్‌ బంగారు తాపడంతో చేసినవే. 136 అడుగుల పొడవు ఉండే దీనిని వేసవికాలంలో అద్దెకు ఇస్తారు. రెంట్ రూ.1.05 కోట్లు.

New Update
Gold ship: సముద్ర అలలపై తొలి బంగారు నౌక.. కళ్లు చెదిరే సౌకర్యాలు!

Gold ship: ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారునౌక సముద్ర అలలపై తేలియాడుతోంది. గోల్డెన్ మెరుపులతో మిరుమిట్లు గొలిపే ఆస్ట్రేలియన్‌ ఏకే రాయల్టీ కంపెనీ అధినేత ఆరన్‌ ఫిడ్లర్ కు చెందిన ఈ నౌకకు ఒక ప్రత్యేకత ఉంది. 24 క్యారట్స్‌ బంగారు రేకుతో తాపడం చేసిన నౌకలోని గదుల్లో ఫర్నిచర్‌ హ్యాండిల్స్, గ్లాస్‌ ఫ్రేమ్స్‌, నాబ్స్, షాండ్లియర్స్ వంటి వస్తువులను కూడా బంగారు తాపడంతో తీర్చిదిద్దడం విశేషం.

publive-image

ఇక ఆ పడవలో సిబ్బందితో పాటు 12 మంది అతిథులు విలాసవంతంగా ప్రయాణించవచ్చు. అతిథులు ఎంజాయ్ చేయడంకోసం డైవింగ్‌ స్కూటర్లు, జెట్‌ స్కీ బోట్లు ఏర్పాటు చేశారు. నాలుగు లగ్జరీ సూట్‌లు, ప్రత్యేక డైనింగ్‌ రూమ్‌లు, బాంకెట్‌ హాల్, స్విమింగ్‌ పూల్, బాక్సింగ్‌ పరికరాలతో కూడిన అధునాతన జిమ్, సినిమా థియేటర్, డీజే బూత్, పబ్‌ తదితర విలాసవంతమైన సౌకర్యాలు అతిథులను మంత్రముగ్దుల్ని చేస్తాయి.

publive-image

దాదాపు 136 అడుగుల పొడవు ఉండే ఆ నౌకను ఎటు నుంచి చూసినా కళ్లు చెదిరేలా బంగారు ధగధగలే కనిపిస్తాయి. ఏటా వేసవిలో, శీతా కాలంలో ఆ నౌకను ప్రయాణికుల విహారానికి అద్దెకు ఇస్తున్నారు.

publive-image

ఆ నౌకలో ప్రయాణించాలంటే వారానికి లక్ష పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ.1.05 కోట్లు చెల్లించాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త, ఫొటోలు వైలర్ అవుతుండగా జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. పలువురు నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు