Hottest Chilli: ఈ మిర్చి తింటే ఇంక అంతే సంగతులు..ప్రపంచంలో ఘాటైన మిర్చి ఇదే ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపగా వరల్డ్ రికార్డు సాధించింది. దీన్ని కనుక తిన్నారా ఇక అంతే సంగతులు ఏకంగా 4 గంటలపాటు గొంతులో విపరీతమైన మంట కలుగుతుంది. ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించిన ఆ మిరపకాయ పేరు పెప్పర్ ఎక్స్. By Vijaya Nimma 02 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఎవరైనా కోపంగా ఉన్నారనుకోండి..ఏంట్రా గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్నావు అంటుంటారు.. సాధారణంగానే మన భారతీయులందరూ కాస్త కారం ఎక్కువగానే తినడానికి ఇష్టపడతారు. కానీ ఇప్పుడు చెప్పే మిర్చిని మాత్రం తినడం మహాకష్టమండీ బాబు..ఎందుకంటారా..? ఇది ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపగా వరల్డ్ రికార్డు సాధించింది. దీన్ని కనుక తిన్నారా..? ఇక అంతే సంగతులు ఏకంగా మూడునాలుగు గంటలపాటు గొంతులో విపరీతమైన మంట కలుగుతుంది. ప్రపంచ స్థాయిలో రికార్డు సాధించిన ఆ మిరపకాయ పేరు పెప్పర్ ఎక్స్. ఇది ఇంతకు ముందు ఉన్న కరోలినా రీపర్ చిల్లీ పెప్పర్‌ను దాటేసి మరీ అధికంగా ఘాటుగా ఉందంటూ రికార్డును సొంతం చేసుకుంది. ఇది కూడా చదవండి: కేసీఆర్ రాజశ్యామల యాగం..అమ్మవారి అలంకారం విశిష్టత ఇదే దీన్ని మాత్రమే కాదు ఇంతకుముందు రికార్డు సృష్టించిన కరోలినా రీపర్ చిల్లీ పెప్పర్‌ను పండించింది కూడా ఒకరే. ఆయనే మిచిగాన్‌కు చెందిన పకర్బట్ పెప్పర్ కంపెనీ వ్యవస్థాపకుడు స్మోకిన్ ఎడ్‌క్యూరీ. కరోలినా రీపర్ చిల్లీని క్రాస్ బ్రీడింగ్ చేయడం ద్వారా పెప్పర్ ఎక్స్‌ను సృష్టించాడు క్యూరీ. ఈ మేరకు ఆయన రన్ చేసే యూట్యూబ్ సిరీస్ హాట్ వన్స్ ఎపిసోడ్‌లో తాను సాగు చేసిన పెప్పర్ ఎక్స్ గురించి ప్రపంచానికి చెప్పారు. దీని గురించి ఇన్‌స్టాగ్రాం వేదికగా ఐదుగురు సెలబ్రిటీ వ్యక్తులను పిలిపించి మరీ వారికి వివరించి, వారితో తినిపించాడు. దీన్ని తిన్న ఆ సెలబ్రిటీలు అబ్బా ఘాటు కారం అంటూ వేరువేరుగా వర్ణించారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మిరపకాయలలో ఉండే కాప్సేసిన్ అనే పదార్థం వల్ల వాటికి ఆ ఘాటు వస్తుంది. అంటే కాప్సేసిన్ తక్కువ ఉంటే మిరపఘాటు తక్కువగా, ఎక్కువగా ఉంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఈ ఘాటును కొలవడానికి స్కోవిల్లే అనే స్కేలును వాడుతారు. మిరపఘాటును పూర్తిగా తగ్గించాలంటే.. దీన్ని 1912లో ఫార్మకాలజిస్టు విల్బర్ స్కోవిల్లే కనుక్కున్నారు కాబట్టి ఆయన పేరుమీదనే ఆ స్కేలును స్కోవిల్లే అని పిలుస్తాం. అంతేకాదు మిరపఘాటును పూర్తిగా తగ్గించాలంటే ఎంత నీరు అవసరం అన్నది కూడా ఈ స్కేలు ద్వారా మనం లెక్కించవచ్చు. దాదాపు 2013న పండించిన కరోలినా రీపర్ చిల్లీ తర్వాత దాన్ని మించిన ఘాటైన మిర్చీని ఎవరైనా పండిస్తారా అని చూశాడట. దాదాపు పదేళ్ల నిరీక్షణ తర్వాత చివరికి ఆయనే జన్యు శాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, వృక్ష శాస్త్రాన్ని ఉపయోగించుకుని మరీ హైబ్రీడ్ పద్థతి ద్వారా పెప్పర్ ఎక్స్‌ను సృష్టించాడు. అంటే ఆయన రికార్డును ఆయనే తిరగరాసుకున్నాడన్నమాట. అయితే.. దీన్ని మనం నేరుగా కొనుక్కునే అవకాశం మాత్రం లేదు.. కేవలం ఇప్పుడు మార్కెట్లో పెప్పర్ ఎక్స్‌తో తయారు చేసిన సాస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. View this post on Instagram A post shared by Hot Ones (@hotones) #hottest-chilli #world-record #pepper-x మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి