World cup 2023: నాడు తండ్రి.. నేడు కొడుకు.. సచిన్‌, రిజ్వాన్‌లను బోల్తా కొట్టించిన తండ్రీకొడుకులు!

నెదర్లాండ్స్‌ మాజీ స్టార్ ప్లేయర్‌ టిమ్‌ బాటలోనే అతని కొడుకు లీడే ప్రయాణిస్తున్నాడు. 2003 ప్రపంచకప్‌లో టీమిండియాలో పై నాలుగు వికెట్లతో సత్తా చాటాడు టిమ్‌. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు టిమ్‌ కొడుకు లీడే. నాడు సచిన్‌ లాంటి టాప్‌ బ్యాటర్‌ని టిమ్‌ బోల్తా కొట్టిస్తే ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌ని అవుట్ చేశాడు లీడే.

New Update
World cup 2023: నాడు తండ్రి.. నేడు కొడుకు.. సచిన్‌, రిజ్వాన్‌లను బోల్తా కొట్టించిన తండ్రీకొడుకులు!

తండ్రికి తగ్గ తనయుడు అనే నానుడిని నిజం అని నిరుపించాడు నెదర్లాండ్‌ స్టార్స్ ప్లేయర్ బాస్ డి లీడే(Bas de Leede). నాడు తండ్రి చేసిన బౌలింగ్‌ని మరిపిస్తూ, మెరిపిస్తూ పాక్‌ బ్యాటర్ల వెన్ను విరిచాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌ వర్సెస్‌ నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో లీడే ఆట గురించి యావత్‌ క్రికెట్ ప్రపంచం చర్చించుకుంటోంది. బాల్‌తోనే కాకుండా బ్యాట్‌తోనూ మెరిసిన లీడే గురించి ఓ న్యూస్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడే 20 ఏళ్ల తర్వాత ఐసీసీ మెన్స్‌ క్రికెట్ వరల్డ్ కప్‌లో తన తండ్రి టిమ్(TIM) ప్రదర్శనను గుర్తు చేశాడు.

publive-image టిమ్ (లెఫ్ట్), లీడే(రైట్)

2003లో ఏం జరిగింది?
2003 ప్రపంచ కప్‌లో ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో టిమ్‌ బౌలింగ్‌లో విశేషంగా రాణించాడు. 9.5 ఓవర్లు వేసిన టిమ్‌ 35 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్‌ను అవుట్ చేశాడు టిమ్‌. ఈ ప్రదర్శన ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచే ఉంది. సచిన్‌ ఆ వరల్డ్‌కప్‌లో టాప్‌ క్లాస్‌ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. పాక్‌, శ్రీలంక లాంటి జట్లకు వణుకు పుట్టించిన సచిన్‌ నెదర్లాండ్స్‌పై పోరులో టిమ్‌కి అవుట్ అయ్యాడు. అటు ది వాల్‌ ద్రవిడ్‌ని సైతం టిమ్‌ అవుట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇండియా కేవలం 206 పరుగులే చేయగలిగింది. అయితే బౌలింగ్‌లో అద్భుతంగా రాణించింది. జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే నాలుగు వికెట్లు పడగొట్టడంతో డచ్ జట్టు 136 పరుగులకే ఆలౌటైంది.

పాక్‌పై కొడుకు విజృంభణ:
ఇక పాక్‌పై మ్యాచ్‌లో టిమ్‌ లీడే అదరగొట్టాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపాడు. అద్భుతంగా ఆడుతున్న పాక్‌ బ్యాటర్‌ రిజ్వాన్‌ని బోల్తా కొట్టించాడు. ఏకంగా అతడిని బౌల్డ్ చేశాడు. ఇక ఇఫ్తికార్‌, షాదబ్‌, అలీని కూడా అవుట్ చేశాడు లీడే. ఇక అంతటితో ఆగలేదు బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. 68 బంతుల్లో 67 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే లీడే కాకుండా మిగిలిన ఆటగాళ్లు ఫెయిల్ అవ్వడంతో నెదర్లాండ్స్‌కి ఓటమి తప్పలేదు. నెదర్లాండ్స్‌పై పాక్‌ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 49 ఓవర్లలో 286 రన్స్‌కి ఆలౌట్ అయ్యింది. ఇటు నెదర్లాండ్స్‌ 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది

ALSO READ: పసికూనలపై పాక్‌ ప్రతాపం.. కాస్త అటూ.. ఇటూ అయ్యింటేనా?

CLICK HERE TO VIEW RTV WHATSAPP CHANNEL

Advertisment
తాజా కథనాలు