Causes Of Cancer: ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్(Cancer) ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణాలకు క్యాన్సర్ కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని (World Cancer Day 2024) జరుపుకుంటారు.
--> శరీరంలోని ఏదైనా భాగంలో అసాధారణ కణాల పెరుగుదల క్యాన్సర్‌కు కారణం కావచ్చు. వంశపారంపర్యత, పర్యావరణం, బ్యాడ్ లైఫ్‌స్టైల్ వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అటు ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పురుషులలో ఎక్కువగా ఉంటుంది.
--> అలసట, అకారణంగా బరువు తగ్గడం, చర్మం పసుపు లేదా నల్లగా మారడం లాంటి చర్మ మార్పులు, మింగడంలో ఇబ్బంది, వివరించలేని రక్తస్రావం సమస్యలు క్యాన్సర్ సంకేతాలు కావచ్చు (Cancer Symptoms). మీ శరీరంలో ఎక్కడైనా అసాధారణమైన ముద్ద ఉన్నట్లు అనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించండి.
--> ధూమపానం (Smoking), మద్యపానం (Alcohol), సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం, ఊబకాయం, అసురక్షిత శృంగారం లాంటి కొన్ని అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాల్లో జన్యుశాస్త్రం కూడా ఒకటి. కుటుంబంలో ఇప్పటికే క్యాన్సర్ ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
--> క్యాన్సర్ రాకుండా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. జీవనశైలి, పోషకాహారం సరిగ్గా ఉండాలి, మద్యపానం, ధూమపానం మానేయడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
Also Read: నేడు దెందులూరులో జగన్ ‘సిద్ధం’.. ఆ జిల్లాలో అతి పెద్ద రాజకీయ బహిరంగ సభ అవుతుందా?
WATCH: