AP- World Bank: ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన రూ.15వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేపటి నుంచి ఈ నెల 27వరకు బ్యాంకు ప్రతినిధులు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు.

New Update
AP- World Bank: ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్!

AP- World Bank: కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ. 15 వేల కోట్ల రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఆయా బ్యాంకుల ప్రతినిధులు రేపటి నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ..

ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు రెండు రోజులపాటు పర్యటించారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఏపీ అభివృద్ధి విషయంపై పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం అయ్యారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్ కేటాయింపు, మెరుగైన రహదారుల నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు., అలాగే ఈ పర్యటనలో ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. దాదాపు రెండు గంటల పాటు మోదీ (PM Modi) తో చర్చలు జరిపిన చంద్రబాబు.. ఏపీకి రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

Advertisment
తాజా కథనాలు