Rajinder Gupta - Founder of Trident Group: చాలా చిన్న స్థాయి నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి.. గొప్ప ఎత్తులను తాకిన పారిశ్రామికవేత్తలు భారతదేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో పంజాబ్ నివాసి, ట్రైడెంట్ గ్రూప్(Trident Group) వ్యవస్థాపకుడు రాజేంద్ర గుప్తా (Rajinder Gupta) ఒకరు. ప్రతి కష్టాన్ని అధిగమించి, ధైర్యంతో ఉన్నత స్థాయికి చేరుకున్న సంపన్నుల జాబితాలో ఆయన ఉన్నారు. ఒకప్పుడు కొవ్వొత్తులు, సిమెంట్ పైపులు తయారు చేసే ఫ్యాక్టరీలో రోజుకు రూ.30 చొప్పున పనిచేసిన రాజేంద్ర గుప్తా నేడు రూ.12000 కోట్ల (రాజిందర్ గుప్తా నెట్ వర్త్) ఆస్తులకు యజమానైయ్యారు. ట్రైడెంట్ గ్రూప్ వ్యాపారం ప్రస్తుతం 100 దేశాలలో సాగుతుంది.
రాజేంద్ర గుప్తా స్థాపించిన ట్రైడెంట్ గ్రూప్ నేడు టెక్స్‌టైల్ , పేపర్ పరిశ్రమలో ఆధిపత్యం చలాయిస్తోంది. భారత వస్త్ర పరిశ్రమకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడంలో రాజేంద్ర గుప్తా పెద్ద పాత్ర పోషించారు. స్వీయ-నిర్మిత వ్యాపార దిగ్గజం రాజిందర్ గుప్తా విజయం మిలియన్ల మంది యువ పారిశ్రామికవేత్తలకు ప్రేరణ. అతని విజయాన్ని పంజాబ్‌లోని వ్యాపార పాఠశాలల్లో కేస్ స్టడీగా బోధిస్తారు.
Also Read: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించండి.. కోర్టులో పిటిషన్
కుటుంబానికి వ్యాపారంతో సంబంధం లేదు.
గుప్తా కుటుంబానికి వ్యాపారంతో సంబంధం లేదు. కుటుంబ కారణాల వల్ల రాజేంద్ర గుప్తా 9వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం 15 సంవత్సరాల వయస్సులో, అతను కొవ్వొత్తుల తయారీ కర్మాగారంలో పని చేయాల్సి వచ్చింది. అప్పట్లో రోజుకు రూ.30 కూలీ వచ్చేది. దీని తర్వాత అతను సిమెంట్ పైపుల తయారీ కర్మాగారంలో పనిచేయడం ప్రారంభించాడు.
మొదటి నుండి తన స్వంతంగా పనిని చేయాలనుకున్నాడు. కొన్నాళ్లు కూలి పనులు చేసిన తర్వాత 1985లో అభిషేక్ ఇండస్ట్రీస్ పేరుతో ఎరువుల కర్మాగారాన్ని స్థాపించాడు. ఆసమయంలో అతనికి పని బాగా పెరిగింది. దీని తర్వాత, 1991లో స్నేహితులతో కలసి స్పిన్నింగ్ మిల్లును ప్రారంభించాడు. ఈ మిల్లు ద్వారా అతనికి భారీ లాభాలు వచ్చాయి. దీని తర్వాత రాజేంద్ర గుప్తా వెనుదిరిగి చూసుకోలేదు. కాలక్రమేణా అతను వస్త్రాలు, కాగితం మరియు రసాయన పరిశ్రమలలో ప్రవేశించాడు. పంజాబ్ ,మధ్యప్రదేశ్‌లో తన కంపెనీ యూనిట్లను ప్రారంభించాడు.