Nithin Gadkari: కారులో ఆరు ఎయిర్‌ బ్యాగులు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే!

రాబోవు కాలంలో కార్లలో 6 ఎయిర్‌ బ్యాగులను(Six Air bags)  తప్పని సరి చేసే ఉద్దేశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nithin gadkari)తెలిపారు.

New Update
Nithin Gadkari: కారులో ఆరు ఎయిర్‌ బ్యాగులు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే!

రాబోవు కాలంలో కార్లలో 6 ఎయిర్‌ బ్యాగులను(Six Air bags)  తప్పని సరి చేసే ఉద్దేశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nithin gadkari)తెలిపారు. గతంలో అక్టోబర్‌(October 2023) నుంచి కారులో తప్పనిసరి 6 ఎయిర్ బ్యాగుల్ని (6 air bags) చేసే భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అయితే బుధవారం ఢిల్లీలో(Delhi) జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అలాంటి నిబంధనలు చేయడం మాకు ఇష్టం లేదని పేర్కొన్నారు.

గత సంవత్సరం రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ రోడ్డు భద్రతలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రయాణికుల భద్రతను మరింత పెంచడానికి సెంట్రల్ మోటార్స్ వెహికల్‌ రూల్స్‌ 1989 ను సవరించడం ద్వారా భద్రతను మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది.

ఏప్రిల్1, 2021 తర్వాత తయారుచేయబడిన వాహనాల్లో ముందు రెండు సీట్లకు ఎయిర్‌బ్యాగుల్ని(2 air bags) తప్పనిసరి చేసింది.వీటి వల్ల ఏవైనా పెద్ద పెద్ద ప్రమాదాలు (accidents) జరిగితే వాటి భారీ నుంచి తప్పించుకోగలరని తెలిపారు.

ప్రస్తుతం ప్రీమియం కార్లకు(premium cars) మాత్రమే కాకుండా రూ. 20 లక్షల లోపు కార్లలో కూడా పలు కంపెనీలు 6 ఎయిర్‌ బ్యాగ్ లను అందిస్తున్నాయి. ప్రజలు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో కార్ల కంపెనీలు కూడా తగు ప్రమాణాలను పాటిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు