Women Reservation Bill: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలోని మహిళలకు మోదీ ప్రభుత్వం గొప్ప శుభవార్తం అందించనుంది. 75 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న మహిళల రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం లభించనుంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. By BalaMurali Krishna 18 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Women Reservation Bill: దేశంలోని మహిళలకు మోదీ ప్రభుత్వం గొప్ప శుభవార్తం అందించనుంది. 75 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న మహిళల రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం లభించనుంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఆమోదం పొందగానే రాజ్యసభకు పంపుతారు. ఈ బిల్లుపై ప్రతిపక్ష నేతలు కూడా సుముఖంగా ఉన్నారు. దీంతో ఈ బిల్లు పార్లమెంట్‌లో సలుభంగా ఆమోదం పొందనుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఇండియా కూటమి సహా ఎన్డీయే నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి జరిగిన చర్చకు అధికారపక్షం, అటు విపక్ష నేతలు అందరూ సముఖత వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలనే డిమాండ్ కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ వినిపించినా కార్యరూపణ దాల్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా ఈ బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. దీనికి అన్ని పార్టీల నుంచి మద్దతు లభించనుందని పేర్కొన్నాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం.. అది కూడా కొత్త పార్లమెంట్‌కు తరలివెళ్లడంతో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించాలని బీజేపీ భావిస్తుంది. ఇందుకు బీఆర్ఎస్, టీడీపీ, బీజేడీ తదితర పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖలు రాశారు. అయితే ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇస్తూనే.. వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాల మహిళలకు రిజర్వేషన్లలో కోటాను నిర్ణయించే అంశాన్ని కూడా లేవనెత్తుతున్నాయి. మంత్రివర్గంలో కీలక బిల్లులకు ఆమోదం.. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కీలక బిల్లులు ప్రవేశపెట్టాలనే దానిపై ప్రధానం చర్చించనున్నారు. అలాగే పార్లమెంటు సమావేశాలను పాత భవనం నుంచి కొత్త భవనానికి తరలించేందుకు మంత్రి వర్గం నుంచి ఆమోదం లభించనుంది. సీఎం కేసీఆర్ సహా విపక్షాల ఒత్తిడి వల్లే.. కొత్త పార్లమెంటు భవనం మహిళలకు కలిసివస్తుందని భావిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహా విపక్షాల ఒత్తిడి వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతోందన్నారు. ఈ బిల్లు ఆమోదంతో కొత్త పార్లమెంటులో మహిళా ఎంపీల సంఖ్య పెరుగుతుందనే ఆశాభావం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి చెక్ పెట్టే దిశగా.. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని 36శాతం మహిళలు బీజేపీకి ఓటేయగా.. 20శాతం మాత్రమే కాంగ్రెస్‌కు ఓటేశారు. దీంతో బీజేపీ గెలుపు సునాయసమైంది. ఇప్పుడు పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టనుండడంతో ఈసారి కూడా మహిళల ఓట్లు గంపగుత్తుగా సాధించాలనే ప్లాన్‌లో మోదీ ఉన్నారు. ఇది కూడా చదవండి: ఏపీ విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి