నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ.. కాంగ్రెస్ తరఫున మాట్లాడనున్న సోనియా గాంధీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై నేడు లోక్‌సభలో చర్చ జరుగనుంది. అయితే, సభలో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆ సోనియా గాంధీ ప్రసంగిస్తారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటా కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. By Shiva.K 20 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sonia Gandhi On Women's Reservation Lok Sabha: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై(Women's Reservation Bill) నేడు లోక్‌సభలో(Lok Sabha) చర్చ జరుగనుంది. అయితే, సభలో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆ సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రసంగిస్తారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటా కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై ఇవాళ అంటే బుధవారం నాడు ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం అవగానే.. చర్చ ప్రారంభిస్తారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ ప్రసంగిస్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు అంటే మంగళవారం నాడు పార్లమెంట్ భవనంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ (Arjun Ram Meghwal) లోక్‌సభ తొలి సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు నారీ శక్తి వందన్ అధినియం (Nari Shakti Vandan Adhiniyam) అని పేరు పెట్టారు. అయితే, 2008లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. 2010లో ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అయితే, లోక్‌సభలో మాత్రం బిల్లు వీగిపోయింది. అయితే, మంగళవారం నాడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘవాల్ ప్రవేశపెడుతూ కీలక విషయాలు వివరించారు. 'ఈ బిల్లు మహిళా సాధికారతకు సంబంధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AAను సవరించడం ద్వారా ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (NCT)లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేయబడతాయి. ఆర్టికల్ 330A రిజర్వేషన్లు హౌస్ ఆఫ్ పీపుల్‌లో SC/ST కోసం సీట్లు కేటాయించడం జరుగుతుంది' అని చెప్పుకొచ్చారు. నారీ శక్తి వందన్ అధినియం ఆమోదించిన తర్వాత, లోక్‌సభలో మహిళలకు సీట్ల సంఖ్య 181కి పెరుగుతుందని అర్జున్ మేఘవాల్ చెప్పారు. బిల్లును ఆమోదించడం కోసం సభలో బుధవారం, సెప్టెంబర్ 20న చర్చ జరుగుతుంది. బిల్లు సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశ పెడతామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ బిల్లు కోసం 128వ రాజ్యాంగ సవరణ చేస్తోంది. తద్వారా రాజ్యాంగంలో 3 కొత్త ఆర్టికల్స్, ఒక కొత్త క్లాజ్‌ను ప్రవేశపెట్టనుంది. 239AAలోని కొత్త నిబంధన ప్రకారం, ఢిల్లీ శాసనసభలో మహిళలకు సీట్లు రిజర్వ్ చేయబడతాయి.ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో 1/3వ వంతు మహిళలకు రిజర్వ్ చేయబడుతుంది. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేయబడే మొత్తం సీట్లలో 1/3 వంతు. పార్లమెంటు నిర్ణయించిన చట్టం ద్వారా మహిళలకు రిజర్వ్ చేయబడుతుంది. కొత్త ఆర్టికల్ - 330A ప్రకారం, లోక్‌సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తారు. SC, STలకు రిజర్వ్ చేయబడిన సీట్లలో 1/3 వంతు మహిళలకు రిజర్వ్ చేయబడుతుంది. లోక్‌సభకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేయబడే మొత్తం సీట్లలో 1/3 వంతు రిజర్వ్ చేయబడుతుంది. మరో ఆర్టికల్ 332A ప్రకారం, ప్రతి రాష్ట్ర శాసనసభలో మహిళలకు రిజర్వ్ చేయబడిన సీట్లు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేయబడిన సీట్లలో 1/3 వంతు మహిళలకు రిజర్వ్ చేయబడతాయి. మొత్తం సీట్లలో 1/3 వంతు మహిళలకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. Also Read: Asian Games 2023: ఇంతకంటే దారుణం మరోటి ఉండదు.. 10 ఓవర్లలో 15 పరుగులు.. ఆలౌట్..! Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదల? మరి ఎన్నికలు ఎప్పుడంటే? #sonia-gandhi #womens-reservation-bill #womens-quota-bill-lok-sabha #sonia-gandhi-on-womens-reservation #womens-quota-bill #womens-reservation-bill-india #nari-shakti-vandan-adhiniyam #నారీ-శక్తి-వందన్-అధినియం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి