Women Marriage Age Bill: యువతుల వివాహ వయస్సు బిల్లుపై ఉత్కంఠ

2021లో యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లు మురిగిపోయిందన్నారు లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య. అయితే, ఈ బిల్లులో ఉన్న అంశాలను ఎవరు పాటించడం లేదని.. కొన్ని ప్రాంతాల్లో 18 ఏళ్ళు నిండని వారికి వివాహాలు చేస్తున్నారని అన్నారు.

New Update
Women Marriage Age Bill: యువతుల వివాహ వయస్సు బిల్లుపై ఉత్కంఠ

Women Marriage Age Bill:17వ లోక్‌సభ ఇటీవల రద్దు కావడంతో 2021 డిసెంబరులో యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లు మురిగిపోయింది. ఈ విషయాన్ని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచార్య పేర్కొన్నారు. అయితే, ఈ బిల్లులో ఉన్న అంశాలను ఎవరు పాటించడం లేదని.. కొన్ని ప్రాంతాల్లో 18 ఏళ్ళు నిండని వారికి వివాహాలు చేస్తున్నారని అన్నారు.

బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు-2021ను లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ బిల్లును విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పరీశీలనకు పంపించింది. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్న యువతుల పెళ్లి వయసును పురుషులతో సమానంగా 21ఏళ్లకు పెంచాలన్నది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. కాగా మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుండడంతో ఈ బిల్లుపై చర్చ మరోసారి నెలకొంది.

జూన్ 15 పార్లమెంట్ సమావేశలు!...

జూన్ 15 నుంచి 22వ తేదీ వరకు 18వ లోక్ సభ తొలి సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల మూడో వారంలో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారాలతో సమావేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించాయి. రెండు రోజుల పాటు ప్రమాణ స్వీకారాలు జరిగే అవకాశం ఉందని, అనంతరం స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నాయి. ఆ తర్వాతి రోజు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించాయి. సమావేశాలు జరుగుతుండగానే తొలి సెషన్ ముగింపుపై కొత్తగా ఎంపికైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని తెలిపాయి. ఈ సమావేశాల్లో భాగంగా ప్రధాని మంత్రి తన కేబినెట్ ను ఉభయ సభలకు పరిచయం చేయనున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు