Womens Asia cup 2024: ఆసియా కప్ లంకదే.. భారత్‌కు తప్పని పరాభవం!

మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింది. భారత్ తో జరిగిన టైటిల్ పోరులో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆసియా కప్ గెలవడం శ్రీలంక మహిళా జట్టుకు ఇదే తొలిసారి. భారత్ ఏడుసార్లు ఆసియా కప్ సొంతం చేసుకుంది.

Womens Asia cup 2024: ఆసియా కప్ లంకదే.. భారత్‌కు తప్పని పరాభవం!
New Update

Womens Asia cup 2024: మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్ కు పరాభవం ఎదురైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ను శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ దక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

ఈ లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించించి కప్ సొంతం చేసుకుంది. 18.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 167 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(43 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), హర్షితా సమరవిక్రమా(51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కవిషా దిల్‌హరి(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించింది.

భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (60; 47 బంతుల్లో 10 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (29; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), రిచా ఘోష్‌ (23; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. షఫాలీ వర్మ (16), ఉమా ఛెత్రి (9), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (11) నిరాశపర్చారు. శ్రీలంక బౌలర్లలో కవిషా 2, సచిని నిశంసల, చమరి ఆటపట్టు ఒక్కో వికెట్ పడగొట్టారు.


#womens-asia-cup-2024 #sri-lanka-won
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe