/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-53-6.jpg)
Womens Asia cup 2024: మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్ కు పరాభవం ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ను శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ దక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
Women's Asia Cup 2024 champions 🏆🇱🇰#SLvIND 📝: https://t.co/gv9YqDRMZ8 | 📸: @ACCMedia1 pic.twitter.com/ibAUAin9dg
— ICC (@ICC) July 28, 2024
ఈ లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించించి కప్ సొంతం చేసుకుంది. 18.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 167 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(43 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), హర్షితా సమరవిక్రమా(51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కవిషా దిల్‌హరి(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించింది.
A maiden Women's Asia Cup title for Sri Lanka 👏#SLvIND 📝: https://t.co/QjLIRY5Yfs | 📸: @ACCMedia1 pic.twitter.com/hISNnvU6nq
— ICC (@ICC) July 28, 2024
భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (60; 47 బంతుల్లో 10 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (29; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రిచా ఘోష్ (23; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. షఫాలీ వర్మ (16), ఉమా ఛెత్రి (9), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (11) నిరాశపర్చారు. శ్రీలంక బౌలర్లలో కవిషా 2, సచిని నిశంసల, చమరి ఆటపట్టు ఒక్కో వికెట్ పడగొట్టారు.