AP: అధ్వానంగా ఆత్మకూరు వీవర్స్ కాలనీ.. 40 ఏళ్ళు గడుస్తోన్నా..

నెల్లూరు జిల్లా ఆత్మకూరు వీవర్స్ కాలనీ వాసులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 40 ఏళ్ళగా తాము మున్సిపాలిటీ పరిధిలో ఉంటున్న సరైన మౌలిక వసుతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కనీసం తాగునీటి వసతి లేదని, రోడ్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AP: అధ్వానంగా ఆత్మకూరు వీవర్స్ కాలనీ.. 40 ఏళ్ళు గడుస్తోన్నా..
New Update

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీ వాసుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పేరుకు మున్సిపాలిటీ పరిధిలో ఉంటున్నా తమ కాలినీలో ఏలాంటి మౌలిక వసతులు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు నుండి నెల్లూరు పాలెం మధ్యలో రోడ్డు పక్కనే ఉండే వీవర్స్ కాలనీలో 40 ఏళ్ళ క్రితం చేనేత కార్మికుల కోసం సుమారు 60 ఇళ్ళను నిర్మించారు. అప్పటి నుండి చేనేత కార్మికులు తమ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  అయితే, ఈ కాలనీ నిర్మించిన సమయంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉండడం ఇక్కడ విశేషం.


రోడ్లు, సైడ్ కాలువలు, వీధిలైట్లు, కనీసం తాగునీటి వసతి కూడా లేకుండా ఈ కాలనీ ఉంటుంది. రాజకీయ నేతలు తమ గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేసారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ మొత్తం ముళ్ళకంపతో చెత్తాచెదారముతో ఉందని.. రాత్రి సమయంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని అంటున్నారు. వర్షం పడిందంటే మోకాలు లోతు బురదలో నడవాల్సిన పరిస్థితి తమదని దానికి తోడు సైడ్ కాలువలు లేకపోవడంతో ఇళ్లల్లో వాడే నీటిని రోడ్లపై వదిలేయవలసి వస్తుందని అంటున్నారు. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి తాగునీటి వసతి ఏర్పాటు చేశారని ప్రస్తుతం ఆయనే తమకు మంత్రిగా రావడం వల్ల తమ సమస్యలు తీరుతాయనే ఆశ ఉందని ఈ కాలనీ వాసులు తెలిపారు.

Also Read: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. మార్గ మధ్యలోనే..

#nellore
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe