లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33శాతం సీట్లు మంజూరు చేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 2 ఓట్లు పడ్డాయి. MIM పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్యలున్నాయి. స్లిప్పుల ద్వారా ఓటింగ్ జరిపారు. ఓటింగ్ స్లిప్పులను సిబ్బంది పంచారు, 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగింది. ఇక బిల్లుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. 2029 ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అటు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. బిల్లుపై 60 మంది ఎంపీలు తమ అభిప్రాయాన్ని సభ వేదికగా చెప్పారు. కొత్త పార్లమెంట్‌లో పాస్ అయిన తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు నిలిచిపోనుంది.
డీలిమిటేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ బిల్లు అమలు కానుంది.
నారీ శక్తి వందన్ అధినియం పేరుతో రూపొందించిన ఈ బిల్లు లోక్‌సభ నియోజకవర్గాల విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది. తదుపరి జనాభా గణన పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ కసరత్తు జరుగుతుంది. కాబట్టి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ బిల్లు అమల్లోకి వచ్చే అవకాశం లేదు. ఎన్నికల తర్వాత చట్టాన్ని అమలు చేసేందుకు జనాభా గణన చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం త్వరలో డీలిమిటేషన్ కసరత్తు చేస్తుందని కూడా చెప్పారు. రాష్ట్రాలకు ప్రస్తుత సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉంది.
ప్రక్రియ మరియు సమయపాలనకు వ్యతిరేకంగా ఉన్నవారిని ప్రశ్నిస్తూ, షా ఇలా అన్నారు: '1/3 వంతు సీట్లు మహిళా ఎంపీలకు రిజర్వ్ చేయబడతాయి, కాబట్టి ఆ సీట్లను ఎవరు నిర్ణయిస్తారు? ప్రశ్న పారదర్శకత, ఎవరూ పక్షం వహించకూడదు' మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం ఇదే తొలిసారి కాదని అన్నారు.
ALSO READ: అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్న స్క్రీనింగ్ కమిటీ..ఛాన్స్ ఎవరికో..?