/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-76.jpg)
Family court: కోర్టు అవరణలోనే ఇద్దరు మహిళా న్యాయవాదులు జుట్లు పట్టుకుని కొట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. జడ్జీ ఎదురుగానే ఇతర లాయర్లు, ఖైదీల ముందే విచక్షణ మరిచి దారుణంగా తగువులాడుకున్నారు. ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ తన్నుకున్నారు. కిందపడేసి చేతొగోళ్లతో ముఖాలు గీసుకున్నారు. పక్కనున్న వారు ఎన్నిసార్లు ఆపినా ఆగకుండా ఒకరిమీద ఒకరు పడి గాయపరుచుకున్నారు. చివరికీ లేడీ పోలీస్ కలగజేసుకుని ఇద్దరినీ వారించడంతో గొడవ సద్దు మణిగింది. అయితే ఈ తతంగాన్ని మొత్తం అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఇతరులకు నీతులు చెప్పాల్సిన వారే ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ తిట్టిపోస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ ఫ్యామిలీ కోర్టులో 2022లో జరిగినట్లు తెలుస్తుండగా మరోసారి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
इन महिला वकीलों को भी क्या कोर्ट पर विश्वास नहीं है कि जो खुद फैसला करने लगीं। कासगंज जिला कचहरी में भिड़ंत... जिला न्यायालय बना जंग का मैदान, 2 महिला अधिवक्ता भिड़ीं। मारपीट का वीडियो सोशल मीडिया पर हुआ वायरल... फैमिली कोर्ट में हुई ये जंग पुलिस तक पहुंची, मामला दर्ज।@Uppolicepic.twitter.com/o1d7ZnPlqc
— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) October 28, 2022