డేటింగ్ యాప్ ద్వారా పరిచయం..హోటల్ లో సామూహిక అత్యాచారం! ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పరిచయాలు ఎన్నో దారుణాలకు దారితీస్తున్నాయి. ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువతి పై కొందరు మోసగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగింది. By Bhavana 26 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పరిచయాలు ఎన్నో దారుణాలకు దారితీస్తున్నాయి. ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువతి పై కొందరు మోసగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగింది. గ్రామంలోని ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి డేటింగ్ యాప్ లో పరిచయం ఏర్పడింది. కొంతకాలం స్నేహం చేసిన తరువాత ఆ యువకుడు యువతికి మాయమాటలు చెప్పి యువతిని నమ్మించాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఓనాడు యువతిని యువకుడు ఆమెను డిన్నర్ కి పిలిచాడు. ఇద్దరు కలిసి గురుగ్రామ్ లోని ఓ హోటల్ కి వెళ్లారు. ఇద్దరు కలిసి డిన్నర్ చేశాక...యువతి మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండ అది అంతా వీడియో తీశాడు. మత్తులోనుంచి బయటకు వచ్చిన తరువాత జరిగిన విషయం తెలుసుకున్న యువతి షాక్ అయ్యింది. ఈ విషయాన్ని కానీ బయటకు చెబితే వీడియో మొత్తానని సోషల్ మీడియాలో పెడతామని యువతిని యువకుడు బెదిరించాడు. అయితే ఆ వీడియోను అడ్డుపెట్టుకొని యువతిని యువకుడు పలుమార్లు బెదిరించాడు. జూన్ 29న ఈ ఘటన చోటు చేసుకోగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు ఫైల్ చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి