Horror House: అస్థిపంజరంతో ఐదేళ్లు.. తమ్ముడి డెబ్ బాడీని ఇంట్లోనే దాచుకున్న అక్క!

ఐదేళ్ల నుంచి ఓ 70ఏళ్ల బామ్మ తన తమ్ముడి మృతదేహంతో కలిసి నిద్రపోతుంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని జీలాంగ్‌లో జరిగింది. మృతదేహం అస్థిపంజరంగా మారి కంపు కొడుతున్నా.. ఇంట్లోనే ఎలుకలు తిరుగుతున్నా ఆమె మాత్రం అక్కడే నివసించింది. ఈ వార్తపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Horror House: అస్థిపంజరంతో ఐదేళ్లు.. తమ్ముడి డెబ్ బాడీని ఇంట్లోనే దాచుకున్న అక్క!

Horror News: తమ్ముడిపై ఎనలేని ప్రేమ.. అతని కంటే తానే ముందు చావాలని కోరుకుంది. అయితే మరణాన్ని ఎవరూ ఆపలేరని తనకు తెలియడానికి దశాబ్దాలు పట్టింది. తనకంటే ముందే తన తమ్ముడు చనిపోయాడు. తమ్ముడు తప్ప తనకు ఎవరూ లేరు. ఏ మతం ప్రకారమైనా మనిషి మరణిస్తే తర్వాత ఆచారాల ప్రకారం.. మృతదేహాన్ని ఖననమో, దహనమో, ఇంకేదైనా చేస్తారు. కొంతమంది మృతదేహాన్ని మెడికల్ కాలేజీలకు అప్పగిస్తారు. వీటిలో ఏది చేయకుండా మాత్రం ఉండరు. కానీ ఆస్ట్రేలియాలోని ఓ బామ్మ మాత్రం తన తమ్ముడి మృతదేహాన్ని ఐదేళ్లు తన వద్దే పెట్టుకుంది. ఆ కుళ్లిన మృతదేహం అస్థిపంజరంగా మారినా ఇంట్లో అలానే ఉంచింది. దాని పక్కనే తిండి తినేది.. ఆ కంపులోనే బతికేది.

అసలేంటీ కథ?
ఓ 70ఏళ్ల బామ్మ .. తన తమ్ముడి మృతదేహం పక్కనే ఐదు సంవత్సరాలు నిద్రపోయిందంటే నమ్మగలారా? మీరు నమ్మకున్నా ఇదే నిజం. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుంటే ఒళ్లు గగురుపొడుచుకోక మానదు. మెల్‌బోర్న్‌కు సమీపంలో జరిగిన ఈ ఇన్సిడెంట్‌ గురించి తెలుసుకోండి.

న్యూటౌన్‌లోని రస్సెల్ స్ట్రీట్‌లో ఓ వృద్ధుడు 2018 నుంచి కనిపించకుండా పోయాడు. అతను ఏం అయ్యాడో చుట్టుపక్కల వారికి తెలియలేదు. ఏళ్లు గడుస్తున్నాయి. ఆ ఇంటి నుంచి వృద్ధురాలు తప్ప ఆమె తమ్ముడు బయటకు రాలేదు. అది ఇండిపెండెంట్‌ హౌస్. ఆ ఇద్దరు తప్ప ఎవరూ ఉండేవారు కాదు. చుట్టు పక్కల ఇళ్లు కూడా ఆ ఇంటికి దూరంలో ఉంటాయి. అయితే గతేడాది(2023)డిసెంబర్‌లో పోలీసులకు ఆ ఇంటి పొరుగున ఉండే వారు వృద్ధుడు కనపడకపోవడంపై సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బామ్మ ఇంటికి చేరుకున్నారు. డోర్‌ ఓపెన్ చేసే ఉండడంతో లోపలికి వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు.

తట్టుకోలేక వాంతులు:
ఎలుకలు ఉన్న ఇంట్లో ఆస్ట్రేలియన్ వృద్ధురాలు తన సోదరుడి కుళ్ళిపోయి, అస్థిపంజరంగా మారిన శవం పక్కన పడుకొని ఉంది. జీలాంగ్‌లోని సంపన్న శివారు ప్రాంతంలో నివసిస్తున్న ఆమెకు 70 ఏళ్లు. పోలీసులకు ఇంటి దగ్గర నుంచే ఓ రకమైన కంపు కొట్టింది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పోలీసులు ముక్కు మూసుకోని ఉండాల్సి వచ్చింది. ఆ వాసన తట్టుకోలేక కొందరి అధికారులకు వాంతులు కూడా చేసుకున్నట్టు సమాచారం. అయితే బామ్మ మాత్రం సాధారణంగానే కనిపించింది. ఇంటి నిండా ఎలుకులే ఉన్నా.. వాసన కొడుతున్నా ఆమె మాత్రం నార్మల్‌గానే ఉండడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. అదుపులోకి తీసుకోని విచారించగా అసలు విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది. బామ్మ చెబుతున్న మాటల విన్న పోలీసులకు నోటి నుంచి మాట రాలేదంటే ఆమె ఐదేళ్ల పాటు ఎలాంటి ఇంట్లో గడిపిందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: జనసేనను మింగేశాడు.. చంద్రబాబుపై సజ్జల హాట్ కామెంట్స్

WATCH THIS TRENDING VIDEO ON YOUTUBE:

Advertisment
తాజా కథనాలు