/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/mahila-jpg.webp)
Pawan Kalyan Birthday: జనసేన అధినేత పవన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళ తన అభిమానాన్ని వేరే లెవల్‌లో చూపించింది. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ మోకాళ్లపై ఆదోని కొండ ఎక్కింది. హనుమంతుడ్ని ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని ఆ ప్రాంతా భక్తులు నమ్మకం. దీంతో ఎంతో కష్టమైనప్పటికీ మోకాళ్లపై 501 మెట్లు ఎక్కింది. జనసేనకు గట్టి మద్దతుదారు ఆ మహిళ. పవన్ కల్యాణ్ సీఎం కావాలన్న ఆకాంక్షతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Follow Us