తల్లిని చంపి.. సూట్ కేసులో కుక్కి..! By Trinath 13 Jun 2023 in క్రైం New Update షేర్ చేయండి అల్లారుముద్దుగా కనీ పెంచిన కన్నతల్లినే అత్యంత కిరాతకంగా చంపేసింది ఓ కుమార్తె. గొంతు నులిమి చంపేసింది గాక.. డెడ్ బాడీని ఓ సూట్ కేసులో కుక్కుంది. తర్వాత చంపింది తానేనంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. వినడానికే ఇబ్బందికరంగా ఉన్న ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తల్లినే చంపిన ఈ కూతురి పేరు సొనాలి సేన్. ఫిజియో థెరపిస్టుగా పనిచేస్తోంది. వయసు 39ఏళ్లు. బెంగుళూరులోని ఓ అపార్ట్‌మెంట్ లో భర్త, అత్త, అమ్మతో కలిసి ఉంటోంది. నిందితురాలిది పశ్చిమ బెంగాల్. కానీ, బెంగళూరులో సెటిల్ అయింది. తల్లీకూతుళ్లు చిన్నచిన్న దానికే తరచూ గొడవ పడేవారు. తాజాగా మరోసారి గొడవ జరిగింది. నిద్రమాత్రలు మింగి చచ్చిపోతానంటూ సొనాలి సేన్ తో అంది ఆమె తల్లి. ఆ మాటకు కోపంతో ఊగిపోయి తల్లి చేత బలవంతంగా నిద్రమాత్రలు మింగించింది. దుప్పటి తీసుకుని గొంతు నులిమి చంపేసింది. హత్య చేశాక డెడ్ బాడీని మాయం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది సొనాలి. కానీ, అవేవి వర్కవుట్ కాలేదు. దీంతో డెడ్ బాడీని తీసుకుని వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయింది. హత్య జరిగినపుడు భర్త ఇంట్లో లేడు. నిందితురాలి ఉన్నా... వేరే రూంలో హత్య జరిగింది. తనకు విషయం తెలియదని ఆమె పోలీసులకు చెప్పింది. ఖాకీలు కేసు నమోదు చేసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. తల్లిని ఒక్కతే చంపిందా..? అత్త సహాయం తీసుకుందా..?. అనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి