ఎయిర్‌ఫోర్స్ అధికారిణిపై దాడి..
పంబాబ్‌లోని పఠాన్‌కోట్ మిలటరీ బేస్‌లో ఓ మహిళ అధికారిణిపై దాడి చేయడం కలకలం రేపింది. అయితే అక్కడ క్యాంటీన్‌లో పనిచేస్తున్న ఓ కార్మికుడు ఎయిర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) ఆఫీసర్ అయిన ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంఇ ఆమెను చండీఘఢ్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్క్వాడ్రన్ లీడర్‌గా పనిచేస్తున్నారు.
నిందితుడు అరెస్ట్..
సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. దాడికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని డీసీపీ లఖ్విందర్ సింగ్ వెల్లడించారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే మిలటరీ బేస్‌లో ఓ అధికారిణిపైనే దాడి జరగడాన్ని అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.