రూపాయి పెట్టుబడి లేకుండా...లక్షల్లో ఆదాయం..యువతకు బెస్ట్ బిజినెస్ ఐడియాలివే..!!

చాలామందికి బిజినెస్ చేయాలన్న కోరిక బలంగా ఉన్నా..పెట్టుబడి అవాంతరంగా మారుతోంది. అయితే అలాంటి వారికోసం రూపాయి పెట్టుబడి లేకుండా లక్షల్లో సంపాదించే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్, క్యాటరింగ్, ఆన్ లైన్ మార్కెట్ ఇలా ఎన్నో బిజినెస్‎లు చేయోచ్చు.

New Update
Money Tips: ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50వేల నుంచి 10లక్షల వరకు లోన్...మీరు అర్హులో కాదో తెలుసుకోండి..!

నేటి యువత చూపంతా బిజినెస్ పైనే ఉంటోంది. ఏదైనా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారకోణంలో ఆలోచిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే సైడ్ బిజినెస్ లు చేస్తున్నారు. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే కొందరికి వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్నప్పటికీ పెట్టుబడి లేక వెనకడుగు వేస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం పైసా ఖర్చు లేకుండా రూపాయి పెట్టుబడి పెట్టకుండా లక్షల్లో సంపాదించే బిజినెస్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు మార్కెట్లో చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాటరింగ్ సర్వీస్:
ఈరోజుల్లో క్యాటరింగ్ కు చాలా డిమాండ్ ఉంది. క్రమంగా దీనికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్ సర్వీసులే వాడుకుంటున్నారు. అయితే ఇంట్లో చేసే వంటకాలకు జనం మొగ్గు చూపుతుంటారు. కాబట్టి ఇంట్లోనే పలు రకాల ఆహారపదార్ధాలు తయారు చేసి క్యాటరింగ్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు. దీనికి పెద్దగా పెట్టుబడే అవసరం ఉండదు.

ఆన్ లైన్ మార్కెటింగ్ :
టెక్నాలజీ రాకెట్ కంటే స్పీడ్ గా దూసుకుపోతుంది. తమతమ వస్తువులను ఆన్ లైన్ లో అమ్ముకుని డబ్బులు సంపాదించే అవకాశం లభిస్తోంది. ఈబే, ఈస్టీ వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలు తక్కువ పెట్టుబడితో ఉత్పత్తులను ఆన్ లైన్లో విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నాయి. హోల్ సేల్ లో ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆన్ లైన్లో అమ్ముతూ డబ్బును సంపాదించవచ్చు. దీన్ని మంచి అదనపు ఆదాయం వ్యాపారంగా మార్చుకోవచ్చు.

ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్ :
ప్రస్తుత మార్కెట్లో ఫ్రీలాన్సర్ లకు మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ రైటింగ్ నుంచి కోడింగ్ వంటి స్కిల్స్ ఉన్నవారికి ఆన్ లైన్లో ఎన్నో ఫ్రీలాన్స్ ఛాన్సులు ఉన్నాయి. దీనికి ఒకరూపాయి కూడా పెట్టుబడి అవసరం ఉండదు. కేవలం మీకున్న నైపుణ్యం ఆధారంగా డబ్బు సంపాదించుకోవచ్చు. లింక్డిన్ వంటి జాబ్ పోర్టల్స్ ఇలాంటి ఫ్రీలాన్సర్ లకు సంబంధించిన జాబ్స్ సమాచారాన్ని అందిస్తుంది.

యూట్యూబ్ ఛానెల్:
రూపాయి పెట్టుబడి పెట్టకుండానే లక్షల్లో సంపాదించే మరో మార్గం యూట్యూబ్ ఛానెల్. దీని ద్వారా తమ కు నచ్చిన, జనం మెచ్చిన వీడియోలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఆన్ లైన్ ట్యూటరింగ్, టూరిజం, ఎంటర్ టైన్ మెంట్ వంటి వీడియోలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఖర్చు లేకుండానే యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి మంచి వ్యాపారం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రైతులకు శుభవార్త.. రేపే ఖాతాల్లోకీ పీఎం కిసాన్ డబ్బులు!

Advertisment
తాజా కథనాలు