RTV Story: RTV కథనంతో నలుగురికి ప్రాణదానం

RTV కథనం ఓ పాప ప్రాణాన్ని కాపాడింది. 11 ఏళ్ళ పాప గుండె మళ్ళీ కొట్టుకునేలా చేసింది. పాపకు గుండె మార్పిడి చేయాలన్న RTV కథనాలకు శ్రీకాకుళానికి చెందిన ఒక ఫ్యామిలీ కదిలి వచ్చింది. 50 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్‌ డెత్ కావడంతో వాళ్ళ ఫ్యామిలీ అవయవదానానికి ముందుకు వచ్చారు.

New Update
RTV Story:  RTV కథనంతో నలుగురికి ప్రాణదానం

RTV Story: ఆర్.టివి కథనం ఓ 11 ఏళ్ళ పాప గుండె మళ్ళీ కొట్టుకునేలా చేసింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, వనస్థలి పురం, ఎన్.జీ.వో కాలనీకి చెందిన సత్యనారాయణ కుమార్తె ఏ.లహరి (11) 6th క్లాస్  చదువుతుంది. రోజు స్కూల్ కు వెళ్ళి వచ్చి.. తల్లిదండ్రులతో ఇంట్లో సందడిగా వుండే లహరికి అనారోగ్యం ఏర్పాడింది. ఏమైందో తెలియదు ఒకటే వాంతులు చాతీలో‌ నొప్పితో తీవ్రమైన ఇబ్బంది పడేది.‌ లహారీని‌ మొదట కొన్ని ఆసుపత్రిలో చూపించన ఉపయోగం లేక హైదరాబాద్ నిమ్స్ లో చేర్పించారు.  తల్లిదండ్రులు నిమ్స్  వైద్యులు చెప్పిన చేదు నిజం విని ఒక్కసారిగా తల్లిదండ్రులలో తీవ్ర భయాందోళన కలిగింది. తమ పాప గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుందని.. పాపకు ఖచ్చితంగా గుండె మార్పిడి చేయాలని తేల్చిచెప్పారు.

జూన్ లో గుండె సమస్యను  గుర్తించారు. ఆ తర్వాత రెండు నెలలు పాటు నిమ్స్ లో చికిత్స చేయించారు. మూడు లక్షలు ఖర్చు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత సహాయం చేసి ఆదుకుంది. అయినా సరే  నిమ్స్ లో ఉన్నంత కాలం పాపకు గుండె ఇవ్వడానికి దాతలు దొరక్కపోగా.. నిమ్స్ ఆసుపత్రి వాతావరణం ఏ మాత్రం పాపను, తల్లిదండ్రులను  పట్టించుకోలేదు.  అలా నిరాశ, బాధతో ఉన్న తండ్రి సత్యనారాయణ తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం పై RTV ప్రసారం చేసిన ఒక కథనాన్ని చూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించబడ్డ ఆ హృదయాలయంలో ఇప్పటికే ఎన్నో గుండె మార్పిడి ఆపరేషన్లను చిన్న పిల్లలకు విజయవంతంగా పూర్తి చేశారు అన్నది అ కథనం.

అది చూసిన తర్వాత.. తండ్రి వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ సొంత ఖర్చులతో భార్య పాపతో కలిసి తిరుపతి చేరుకొని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అడ్మీట్ అయ్యారు. అలా నవంబర్ నెలలో వచ్చిన వీరికి డిసెంబర్ 18న ఓ దాత గుండె అందుబాటులో ఉన్నట్లు తెలిపారు వైద్యశాల యాజమాన్యం. రేపే ఆపరేషన్ అని‌కూడా తెలిపారు.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి స్ట్రోక్‌తో బ్రెయిన్‌ డెత్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. శ్రీకాకుళం జేమ్స్‌ ఆసుపత్రిలో గుండెను సేకరించి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వైజాగ్‌కు.. అనంతరం తిరుపతికి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. ఇందుకు సుమారు మూడుగంటల సమయం పట్టింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి గ్రీన్‌ఛానల్‌ ద్వారా తీసుకువచ్చారు.  అప్పటికే ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్‌లో సిద్ధంగా ఉన్న  డా.శ్రీనాథ్‌రెడ్డి, డా.గణపతి ఆధ్వర్యంలో పాపకు  విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్సను  నిర్వహించారు.

ఆపరేషన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో సాధారణంగా వార్త కవర్ చేయడానికి వెళ్లిన RTV తో తల్లిదండ్రులు ఎంతో కృతజ్ఞత‌ భావంతో ధన్యవాదాలు తెలిపారు. RTVలో చూసిన కథనంతోనే తాము ఇక్కడకు వచ్చామని.. ఇవాళ తమపాప ప్రాణాలు నిలపడానికి కారణం అయిన RTV యాజమాన్యానికి లహారీ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Life Style: మీకు కోపం ఎక్కువా? అయితే ఈ ఫుడ్స్ కి కాస్త దూరం గా ఉండండి

#rtv-story-saved-a-child-life
Advertisment
Advertisment
తాజా కథనాలు