వాటర్ డైట్ తో బరువు ఇట్టే తగ్గొచ్చు! బరువు తగ్గాలని అనుకుంటే వెంటనే వాటర్ డైట్ ప్రారంభించండి. అదేంటీ? నీళ్లు తాగితే బరువు తగ్గిపోతారా అనేగా మీ సందేహం? అయితే, తప్పకుండా నీరు చేసే అద్భుతాలు గురించి తెలుసుకోవల్సిందే. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రిషన్ పేర్కొన్న వివరాలను ఈ ఆర్టికల్ తెలుసుకుందాం. By Durga Rao 03 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి ఊబకాయం అనేక వ్యాధులకు ఆధారం. ఇది చక్కెరతో మొదలై క్రమంగా వివిధ వ్యాధులకు కారణమవుతుంది. మారుతున్న సంస్కృతి జీవన విధానం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది సరైన వ్యాయామం, ఆహారం లేకుండా బరువు పెరుగటంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆర్టికల్ లో మేము నిపుణులు తెలిపిన వాటర్ డైట్ గురించి చెబుతున్నాము. నీరు శరీరంలోని అన్ని అవయవాలకు మేలు చేస్తోంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచుతుంది.అదనపు బరువును తగ్గించుకోవడానికి వాటర్ డైట్ చేయడం చాలా మంచిది.వ్యాయామం చేసి క్యాలరీలను తగ్గించుకోవడం కష్టమనిపిస్తే.. వాటర్ డైట్ ట్రై చేయండి.రోజుకు 3 లీటర్ల కంటే ఎక్కువగా నీరు తాగేవారిలో శరీరం మెటబాలిజం రేటు పెరుగుతుందట. నీరు ఎక్కువగా తాగితే.. శరీరంలో చేరే వ్యర్థాలు మొత్తం సులభంగా బయటకు పోతాయి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీళ్లు తాగండి. భోజనానికి ముందు రెండు కప్పుల నీరు తాగండి. ఇలా చేయడం వల్ల కడుపు నిండుగా ఉండి ఆహారం ఎక్కువ తినలేరు. దీనివల్ల బరువు తగ్గుతారు. రోజూ కేవలం నీటిని మాత్రమే తాగాలంటే కాస్త బోర్గా అనిపించవచ్చు. కాబట్టి.. నిమ్మ, పుదీనా, దోసకాయ ముక్కలు కలిపిన నీరు తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది. #water-diet #lose-weight మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి