భారత్‌ ప్లేయింగ్ 11లో మార్పు ఉంటుందా?

ఈరోజు ఆసియా జట్లు భారత్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి.వెస్టిండీస్‌లోని బార్బడోస్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.అయితే ఈ మ్యాచ్ లో భారత్ ప్లేయింగ్ లెవన్ లో ఎటువంటి మార్పులు చేస్తారనేది అభిమానుల్లో నెలకొంది.

భారత్‌ ప్లేయింగ్ 11లో మార్పు ఉంటుందా?
New Update

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8 రౌండ్‌లో భారత్‌ నేడు ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. మరి నేటి మ్యాచ్‌లో ఆడే 11 మంది ఆటగాళ్లు ఎవరనేది చూడాలి.భారత్, అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధించాయి. ఇప్పటి వరకూ జరిగిన సూపర్ 8 రౌండ్ మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా, ఇంగ్లాడ్  గెలుపొందాయి.

ఈరోజు ఆసియా జట్లు భారత్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. వెస్టిండీస్‌లోని బార్బడోస్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.నేటి మ్యాచ్‌లో భారత జట్టులో 11 మంది ఆటగాళ్లు రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ మరియు మహ్మద్ సిరాజ్ ఉన్నారు. 

బార్బడోస్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో సగటు 158 పరుగులు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 70 శాతం విజయం సాధించింది. అందువలన, టాస్ గెలిచిన జట్టు కెప్టెన్లు తరచుగా బ్యాటింగ్ ఎంచుకుంటారు.ఈ పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లు 67 శాతం వికెట్లు తీశారు.

#ind-vs-afg
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe