మాకేమైనా పెట్రోల్‌ ఫ్రీగా వస్తుందా ?.. ట్రాఫిక్‌ డీసీపీని మరోసారి టార్గెట్‌ చేసిన హీరోయిన్

డింపుల్‌ మరోసారి వివాదంలో చిక్కుకుందా.. ట్రాఫిక్‌ పోలీసులను ఎందుకు టార్గెట్‌ చేశారు. వర్షం మీద కోపం ట్రాఫిక్‌ పోలీసుల మీద చూపిస్తుందా.. డింపుల్‌, డీసీపీ రాహుల్‌ హగ్డేల మధ్య వివాదం మళ్లీ మొదటికి వచ్చిందా.. ట్రాఫిక్‌ పోలీసులపై చేసిన ఫిర్యాదు సోషల్‌ మీడియాలో ఎందుకు వైరల్‌గా మారింది.

New Update
మాకేమైనా పెట్రోల్‌ ఫ్రీగా వస్తుందా ?.. ట్రాఫిక్‌ డీసీపీని మరోసారి టార్గెట్‌ చేసిన హీరోయిన్

Will petrol come free in Makemaina?.. Heroine who targeted traffic DCP once again

డింపుల్‌ మరోసారి వివాదంలో చిక్కుకుందా.. ట్రాఫిక్‌ పోలీసులను ఎందుకు టార్గెట్‌ చేశారు. వర్షం మీద కోపం ట్రాఫిక్‌ పోలీసుల మీద చూపిస్తుందా.. డింపుల్‌, డీసీపీ రాహుల్‌ హగ్డేల మధ్య వివాదం మళ్లీ మొదటికి వచ్చిందా.. ట్రాఫిక్‌ పోలీసులపై చేసిన ఫిర్యాదు సోషల్‌ మీడియాలో ఎందుకు వైరల్‌గా మారింది.

టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయత్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. వర్షంతో సిటీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడుతున్నాయి. దీంతో గురువారం డింపుల్ హయత్‌ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఎంతసేపటికీ ట్రాఫిక్‌ క్లియర్‌ కాకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకేమైనా పెట్రోల్‌ ఫ్రీగా వస్తుందా..? తాను ఎంతసేపని ట్రాఫిక్‌లో చిక్కుకోవాలని, ట్రాఫిక్‌ను క్లీయర్‌ చేయకుండా ట్రాఫిక్‌ పోలీసులు ఏంచేస్తున్నారని, ట్రాఫిక్‌ డీసీపీలు నిద్రపోతున్నారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై భారీగా వాహనాలు నిలిచిపోయిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి 'వేర్ ఇస్ ట్రాఫిక్ డీసీపీ' అంటూ టింపుల్‌ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌కు ట్యాగ్‌ చేశారు. ఏదైనా మెడికల్‌ ఎమర్జెన్సీ ఉంటే ఏంటి పరిస్థితి, తాము ఇళ్లనుంచి బయటకు రాగలమా..? అంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చిన డింపుల్‌ మరోసారి వివాదానికి తెరలేపినట్లైంది. దీనిపై వివాదాలు రావడంతో డింపుల్‌ పోస్ట్‌ను తొలగించింది.

గతంలో ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్దే, డింపుల్‌ మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లారు. డింపుల్ హయత్ , డీసీపీ రాహుల్ హెగ్డే ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. వేకిల్స్‌ పార్కింగ్‌ విషయంలో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. డింపుల్‌ డీసీపీ కారును కాలితో తన్నిన వీడియో గతంలో వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు డీసీపీ ప్రభుత్వ ఆస్తులను తన సొంత పనులకోసం ఉపయోగిస్తున్నారని డింపుల్‌ ఆరోపించారు. కాగా ప్రస్తుతం ట్రాఫిక్‌పై చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు