Vizag: జగన్‌ను కలవరపెడుతున్న వైజాగ్.. అక్కడ పట్టు దొరికేనా? ఏపీ రాజకీయాలను గతంలో ఎవరు శాసించని విధంగా శాసిస్తున్న సీఎం జగన్‌కు ఒక్క ప్రాంతం మాత్రం తలనొప్పిగా మారిందట. 2014 నుంచి ఆ ప్రాంతం మీద పట్టు సాధించలేకపోతున్నామని ఆవేదన ఉందట. తన తల్లిని ఓడించిన ప్రాంతంపై ఇప్పటికి జగన్ పట్టు సాధించలేకపోతున్నామని వాపోతున్నారట. ఇప్పుడు ఆ ప్రాంతంపై పట్టు కోసం ఏకంగా తన బాబాయిని రంగంలోకి దింపారు జగన్. By BalaMurali Krishna 19 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 175 స్థానాల్లో 151 సీట్లు గెలవడం అసాధారణం. అలాంటి అఖండ విజయాన్ని అందుకున్న ఘటన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ది. దేశంలో అతి కొద్ది పార్టీలు మాత్రమే ఇంతటి ఘన విజయాన్ని సాధించాయి. అసెంబ్లీలోనే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు చోటనేది లేకుండా చేయడం సామాన్యమైన విషయం కాదు. అంతటి ఘన చరిత్ర నమోదుచేసుకున్న జగన్‌కు వైజాగ్ మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తుందట. విశాఖలో పనిచేయని జగన్ వ్యుహాలు.. 2014 నుంచి విశాఖపట్నంలో పట్టు సాధించాలని భావిస్తున్న జగన్‌కు ఆ సిటీ అంతగా కలిసి రావడం లేదు. జగన్ వ్యూహాలు అక్కడ మాత్రం పనిచేయడంలేదు. 2014 ఎన్నికల్లో ఏకంగా జగన్ తల్లి విజయమ్మ ఎంపీగా పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. అప్పటి నుంచి ఆ సిటీ వైసీపీకి మచ్చెమటలు పట్టిస్తోంది. అందుకే విశాఖ ఎలాగైనా పట్టు సాధించాల్సిందనే భావనతో అత్యంత సన్నిహితుడైన విజయ్ సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా పెట్టి రాజకీయాలు నడిపించారు జగన్. నాలుగు స్థానాల్లోనూ పరాజయం.. 2017 నుంచి విశాఖలోనే మఖాం వేసిన విజయ్ సాయిరెడ్డి చాలా వరకు ఆ పార్టీని మెరుగుపరచడానికి ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక్క విశాఖ నగరం తప్పితే మిగతా జిల్లాల్లో ఆయన వ్యూహాలు బాగానే వర్క్ అవుట్ అయ్యాయి.. కానీ విశాఖ సిటీలో మాత్రం పనిచేయలేదనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించినా వైజాగ్‌లో మాత్రం నాలుగు సీట్లకు గానూ నాలుగు ఓడిపోయింది. ఒక్క ఎంపీ స్థానం మాత్రమే కైవసం చేసుకుంది. నగరంలోనే ఉంటూ రాజకీయాలు చేసిన విజయ్ సాయిరెడ్డి సిటీలో ఉన్న నాలుగు స్థానాల్లో ఒక్క స్థానం కూడా గెలిపించలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. విశాఖపై మరింత ఫోకస్.. 2019 ఫలితాల తర్వాత విశాఖపై వైసీపీ అధిష్టానం మరింత ఫోకస్ పెట్టింది. ఆ ప్రాంతాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పట్టు సాధించాల్సిందేనని అధినేత జగన్ భావించారు. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను సాధించింది. అయితే 2024లో నగరంలో ఉన్న నాలుగు స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని హాలను సిద్ధంచేస్తున్నారు. అక్కడి నుండే పాలన చేయాలనుకుంటున్న తరుణంలో నగరంలో ఒక సీటు కోల్పోయినా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నారు. నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా ప్రజలు కూడా పరిపాలన రాజధానికి మద్దతుగా నిలిచారనే అంశం హైలెట్ చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనబడుతుంది. టెన్షన్ పెడుతున్న వలసలు.. ఇందుకోసం విజయ్ సాయి రెడ్డి వ్యూహాలు వర్కౌట్ కాకపోవడంతో ఆయన స్థానంలో తన బాబాయి వైవి సుబ్బారెడ్డిని విశాఖకు మార్చారు. సుబ్బారెడ్డి రాజకీయ అనుభవంతో నగరంలో పూర్తిస్థాయిలో పట్టు సాధిస్తుందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల ఏడాది కావడంతో పార్టీలు అంతర్గత విభేదాలు, వలసల కారణంగా సుబ్బారెడ్డి టెన్షన్ పడుతున్నారనే టాక్ నడుస్తుంది. నగరంలో కీలక నేతలుగా ఉన్న కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు వైసీపీని వీడి జనసేనలో చేరడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. అలాగే మరికొంత మంది నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వలసలను సుబ్బారెడ్డి ఆపకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అయితే సుబ్బారెడ్డి తన మార్కు రాజకీయంతో జగన్ అనుకున్న ఫలితాలను తీసుకురాగలరా? లేదా? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి