Weather: భయపెడుతున్న తుఫాన్..ఏపీ, తెలంగాణలో భారీ వర్షం పడుతుందా? చలి పెరుగుతుందా?

దక్షిణభారతదేశం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వాతావరణాన్ని ఐఎండీ పరిశీలిస్తోంది. కొంతమేర తుఫాన్ విస్తరించిందని..లక్షద్వీప్ లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నేడు ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే ఛాన్స్ లేదు. చలిమాత్రం పెరుగుతుందని వెల్లడించింది.

TS Weather : చల్లబడిన వాతావరణం..మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు..!
New Update

దక్షిణ భారతదేశం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణాన్ని భారత వాతావరణ శాఖ విభాగం పరిశీలిస్తోంది. ఈ తుఫాన్ వాతావరణం కొంత విస్తరించిందని ఐఎండీ తెలిపింది. దీని కారణంగా నేడు లక్షద్వీప్ లో వర్షాలు కురుస్తాయని..ఆ తర్వాత క్రమంగా జోరు తగ్గుతుందని తెలిపింది. నేడు తమిళనాడులో వర్షాలు పడతాయని చెప్పలేదు. అయితే నిన్న రోజంతా వర్షాలు కురిశాయి.

ఇక నేడు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే ఛాన్స్ లేదని ఐఎండీ అంటోంది. మేఘాలు కూడా కొంత తగ్గుతాయి. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాయలసీమ, హైదరాబాద్, దక్షిణ తెలంగాణలో తేలికపాటి మేఘాలు ఉండగా..మధ్యాహ్నం 12 తర్వాత రాయలసీమలో ఎండ రానుంది. ఆ తర్వాత క్రమంగా తెలుగు రాష్ట్రాల్ల మేఘాలు కనిపించవు. కానీ రాత్రి 6 తర్వాత తెలంగాణలో మేఘాలు విస్తరిస్తాయి. రాత్రి 11 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు కనిపించవు.

ఏపీ, తెలంగాణలో గాలులు వీస్తాయి. రాయలసీమలో గాలుల వేగం గంటలకు మ్యాగ్జిమం 15 కిలోమీటర్లు ఉంటుంది. కోస్తా, ఉత్తరాంధ్రలో మ్యాగ్జిమం 10 కిలోమీటర్లుగా ఉండనుంది. దక్షిణ తెలంగాణలో 13కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తర తెలంగాణలో గాలుల వేగం గంటల పది కిలోమీటర్లుగా వీస్తాయి.

ఇక ఉష్ణోగ్రతలను చూసినట్లయితే...తెలంగాణ రాత్రి 17డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. పగటివేళ 27డిగ్రీలు ఉంటుంది. ఏపీలో రాత్రి 21 డిగ్రీలు ఉంటే పగటిపూట 28డిగ్రీలు ఉంటుంది. నేడు దక్షిణ రాయలసీమ, ఉత్తర తెలంగాణ చల్లగా ఉంటుంది. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుంది.

మొత్తంగా చూసినట్లయితే తుఫాన్ వాతావరణం బలంగా తగ్గుతోంది. డిసెంబర్ 20 నుంచి సాధారణ వాతావరణం ఉండేలా కనిపిస్తుంది. ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలకు వర్షాలు లేనట్లే చెప్పుకోవచ్చు. అయితే తూర్పు ఆసియాలో ఫిలిప్పీన్స్ దగ్గర జెలావత్ అనే చిన్న తుఫాన్ మేఘాలను పోగుచేస్తుంది. అక్కడి నుంచి మేఘాలు వస్తే మన వైపు, డిసెంబర్ 23 తర్వాత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: డయాబెటిస్ పేషెంట్స్ కు ఇది సూపర్ ఫుడ్…మరెన్నో రోగాలకు చెక్ ..!!

#weather
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe